Revanth Reddy: కేసీఆర్ ఫాంహౌస్‌లో జిల్లేళ్లు మొలిపిస్తా, గుంటూరులో కేటీఆర్ ఇడ్లీ అమ్ముకునే వాడు - రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments on KCR: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా విమర్శలు చేశారు.

Continues below advertisement

Revanth Reddy on BRS Leaders: తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సుదీర్ఘంగా విమర్శలు చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని.. రాష్ట్రాన్ని కాపాడేది కూడా తామే అని రేవంత్ చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. దాన్ని తీసేస్తామని బీఆర్ఎస్ నేతలు అంటుండడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

ఎవడు వస్తడో రండి
‘‘ఆ గాడిదలకు బుద్ది లేదు.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడో రండి.. నేను చూస్తా. రాజీవ్‌ గాంధీ విగ్రహం సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే రీతిలో మేం ప్రతిష్ఠ చేస్తాం. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులకి విలువ ఇవ్వని సన్నాసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్, ఆయన కొడుకు తెగించి దోచుకున్నారు. ఆ కాలకేయ ముఠా, మీడతల దండు నుంచి తెలంగాణను కాపాడుకుందాం’’ అని రేవంత్‌ సంచలనంగా విమర్శలు చేశారు.

ఫాంహౌస్‌లో జిల్లే్ళ్లు మొలిపిస్తం
కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్రంగా, ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్విటర్ పిట్ట అయిన కేటీఆర్ కు కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయ్యాడు అంటే అది రాజీవ్‌గాంధీ చలవే. పదవులు, ప్రాణ త్యాగం అంటే గాంధీ కుటుంబం మాత్రమే గుర్తుకు వస్తుంది. కేటీఆర్ అయ్య ముఖ్యమంత్రి.. కేసీఆర్ కొడుకు మంత్రి.. అల్లుడు హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రి, ఇంట్లో ఒకరు రాజ్యసభ.. మరొకరు ఎమ్మెల్సీ. కేసీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిండు. అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? మీ ఫామ్ హౌస్‌లలో జిల్లేడు మొలిపిస్తా.. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టిస్తున్నం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

 

Continues below advertisement