Revanth Reddy: తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానంటే అది ప్రభుత్వ పాఠశాలల్లో తనకు అందిన విద్య వల్లే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని కొంత మంది ఎగతాళి చేస్తున్నారని అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొని ప్రసంగించారు. నూతనంగా నియమించిన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్, మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందజేశారు. నూతనంగా నియమించిన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్, మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందజేశారు.


‘‘నేను కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుకున్నా. నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యానంటే నాడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో అందించిన విద్య‌నే కార‌ణం. నేను గుంటూరులోనో, గుడివాడ‌లోనో చ‌దువుకోలేదు.. గుంటూరులోనో, గుంటూరు మ‌రెక్క‌డో చ‌దువుకున్న కొంద‌రు నాకు ఇంగ్లీష్ రాద‌ని అవ‌హేళ‌న చేస్తున్నారు. చైనా, జ‌పాన్‌, జ‌ర్మ‌నీలో వారికి ఇంగ్లిష్ రాదు. కానీ ప్ర‌పంచంతోనే పోటీప‌డే అభివృద్ధి, ఉత్ప‌త్తుల‌ను ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఓ భాష‌, ప్ర‌పంచంలో ఉద్యోగం, ఉపాధికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మా రోజుల్లో నాడు ఉన్న అవ‌కాశాల‌ను ప‌ట్టి మేం నేర్చినంత చ‌దువులు నేర్చుకున్నాం.


నేడు ప్ర‌పంచంలో ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చే ఇంగ్లీషును నేర్పండి. మీ ద‌గ్గ‌ర చ‌దువుకునే పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ రాదని అవ‌హేళ‌న చేసే ప‌రిస్థితి రావ‌ద్దు. మీ ద‌గ్గ‌ర చదువుకునే పిల్ల‌ల‌కు మంచి భాష‌ను, భావాన్ని దేశ‌భ‌క్తిని నేర్పండి. వారే రేప‌టి పాల‌కులు అవుతారు. రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌లు ఇచ్చామ‌ని గ‌త పాల‌కులు చెబుతున్నారు. వాటిలో ఎక్క‌డైనా మౌలిక వ‌స‌తులు క‌ల్పించారా? అందుకే మోడ‌ల్ గురుకుల పాఠ‌శాల తీసుకురావాల‌ని రూ.25 ఎక‌రాల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.150 కోట్ల‌తో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నాం’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.