Babu Mohan Joins in Prajashanti Party: సినీ నటుడు, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan)ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ బాబు మోహన్ (Babu Mohan)కు కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బాబు మోహన్ (Babu Mohan)ప్రజా శాంతి పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి పోటీ చేసి తీరతానని బాబు మోహన్ (Babu Mohan)గతంలో వ్యాఖ్యానించారు. ఇంతకుముందు బీజేపీలో ఉన్న ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతోనే తీవ్రమైన అసమ్మతి వ్యక్తం చేసి ఇటీవలే బాబు మోహన్ (Babu Mohan)కాషాయ పార్టీ నుంచి బయటికి వచ్చారు. 


ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారినట్లుగా చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీలో ఉండగా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్ఠానం నిరాకరించింది. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. నెల రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేస్తూ.. ఆ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. తనను బీజేపీలో అవమానిస్తున్నారని.. తన ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని వాపోయారు. తనకు  పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని.. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా కచ్చితంగా పోటీ చేస్తానని ఆ సందర్భంగా బాబు మోహన్‌ (Babu Mohan) వ్యాఖ్యలు చేశారు.    


నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే బాబు మోహన్ (Babu Mohan)తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఆ తర్వాత ఆందోల్ టికెట్ ఆయనకే ఇవ్వడంతో చల్లబడ్డారు. కానీ, అక్కడి నుంచి ఓడిపోయి మూడో స్థానానికే పరిమితం అయ్యారు. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున దామోదర రాజనర్సింహ విజయం సాధించారు.






1999లో తొలిసారి ఎమ్మెల్యేగా


బాబు మోహన్ (Babu Mohan)రాజకీయ జీవితం 1999కి ముందే ప్రారంభం అయింది. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని కావడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేశారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. 2014లో ఆయనపైనే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో అప్పటి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు.