PM Modi Adilabad Tour : దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ ఓ ఉదాహరణగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకింత చేసిన ప్రధాన మంత్రి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు చేశారు. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు, ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్రం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలియజేశారు.
అభివృద్ధికి మోదీ హామీ
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని... అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.అందుకే హైవేల నుంచి అన్ని విభాగాల్లో సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అందులో భాగంగా 56 వేల కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని దాని ద్వారా దేశం బలపడుతోందని వివరించారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని... అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.అందుకే హైవేల నుంచి అన్ని విభాగాల్లో సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అందులో భాగంగా 56 వేల కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని దాని ద్వారా దేశం బలపడుతోందని వివరించారు. కేంద్రంలో తాము తీసుకన్న నిర్ణయాలతోనే దేశంలో పాతిక కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని పేర్కొన్నారు మోదీ. పదేళ్లుగా అనేక రంగాల్లో వృద్ధి బాటలో దూసుకెళ్తున్నామని తెలియజేశారు.
పెద్దన్న మోదీ తెలంగాణకు సహకరించాలి: రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మోదీకి ఘన స్వాగతం పలికినట్టు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే వేదికపై మాట్లాడిన రేవంత్... మోదీని పెద్దన్నగా అభివర్ణించారు.. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ సహా చాలా రంగాల్లో వెనుకబడ్డామని తెలిపారు. కేంద్రంతో ఘర్షణపూరిత వైఖరితో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుబడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెద్దన్నగా భావించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని వేడుకున్నారు.
పాలన విషయంలో, తెలంగాణ ప్రజల బాగోగుల విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు రేవంత్. గుజరాత్‌లా అభివృద్ధి సాధించాలంటే తెలంగాణకు ప్రధానమంత్రి మోదీ సాయం కావాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి తమకు పెద్దన్న లాంటి వ్యక్తి అని విభజన చట్టంలోని చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాంటి వాటిలో విద్యుత్ ఒకటని పేర్కొన్నారు. నాలుగువేల మెగావాట్లకు బందులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించామని పేర్కొన్నారు. మిగిలిన వాటిని త్వరగా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆశయానికి తెలంగాణ సాయం
భారత్ ఐదు ట్రిలియన్ ఎకానమీని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి కంటోన్మెంట్‌లో రక్షణ శాఖ భూములు బదలాయించడం అభివృద్ధిలో మరో అడుగుగా అభివర్ణించారు. స్కైవేల నిర్మాణానికి ఎంతో సహకారిస్తుందన్నారు.
అంతక ముందు మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రం అనేక విధాలుగా సాయం చేస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో కూడా అలాంటి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. అన్ని విధాలా తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రికి ప్రజల తరుఫున కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
రెండు రోజుల పర్యటన నిమితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ చేరుకున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేందుకు ఆదిలాబాద్ వచ్చిన ప్రధానమంత్రికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.