JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, నేటి వరకు అవకాశం

దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్-2024 సెషన్‌-2 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 3తో ముగియగా.. ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు. 

Continues below advertisement

JEE Main 2024 Session 2 Application Extended: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main)-2024 సెషన్‌-2 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 3తో ముగియగా.. ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.  కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

Continues below advertisement

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్-2024 రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్‌టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.

వివరాలు...

* జేఈఈ మెయిన్ 2024 (సెషన్-2)

అర్హతలు..

➥ బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాట కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ/ సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్టుల్లో ఏదైనా  కలిగి ఉండాలి. 

➥ బీఆర్క్ కోర్సలకు ప్రవేశాలు కోరేవారు ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.  (లేదా) పదో తరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మ్యాథమెటిక్స్) ఉండాలి.

➥ ఇక బీప్లానింగ్‌కు తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.

➥ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం ఉండాాలి.

పరీక్ష ఫీజు వివరాలు..

పరీక్ష విధానం:

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) ఇలా
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.  సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.  డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది.  మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు.  బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. 

దరఖాస్తుల సమర్పణ ఇలా..

స్టెప్-1: ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబరు, పేరు వంటి ప్రాథమిక వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు కూడా పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత, ప్రత్యేకమైన JEE మెయిన్ 2024 అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. తదుపరి లాగ్-ఇన్‌ల కోసం సేవ్ చేయాలి

స్టెప్-2: రెండో దశలో అభ్యర్థులు అదే అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి.

స్టెప్-3: అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను పేర్కొన్న ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లో స్పెసిఫికేషన్‌లు వివరంగా ఉంటాయి.

స్టెప్-4: NTA JEE మెయిన్ 2024 దరఖాస్తు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ లేదా ఏదైనా ఇతర ఎంపిక ద్వారా చెల్లింపు చేయవచ్చు.

స్టెప్-5: చెల్లింపు చేసిన తర్వాత, అభ్యర్థులు తదుపరి ఉపయోగం కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు సమయంలో అవసరమయ్యే పత్రాలు..

➥ దరఖాస్తుదారు ఫోటో స్కాన్ చేసిన కాపీ

➥ దరఖాస్తుదారు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ

➥ కేటగిరీ సర్టిఫికెట్లు(వర్తిస్తే)

➥ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ మొదలైన ఫోటో గుర్తింపు రుజువు

➥ 10వ తరగతి మార్కు షీట్

➥ ఇంటర్మీడియట్  మార్క్ షీట్.

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Online Application

Official Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement