Telangana Socio Economic Survey 2025: తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరపు 33 జిల్లాల జీడీడీపీ లెక్కలను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ -2025 బుక్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 33 జిల్లాల్లో జీడీడీపీలో రంగారెడ్డి జిల్లా తొలిస్థానంలో ఉండగా, ములుగు జిల్లా చివరలో ఉంది.
 
జీ.ఎస్.డీ.పీ అంటే ఏంటీ?జీ.ఎస్.డీ.పీ అనేది రాష్ట్ర ప్రగతికి సూచికగా ఆర్థిక నిపుణులు చెబుతారు. జీ.ఎస్.డీ.పీ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అదే దేశం విషయానికి వస్తే జీడీపీగా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌గా లెక్క గడతారు. ఇక జిల్లా పరిధిలో చూస్తే దాన్ని జీడీడీపీ అంటే గ్రాస్ డిస్ట్రిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌గా లెక్క గడతారు. ఒక ఏడాదిలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల ఉత్పత్తుల విలువను స్థూల జాతీయోత్పత్తి విలువ ( జీడీపీ) అదే రాష్ట్రంలో అయితే జీఎస్డీపీగా, జిల్లా పరిధిలో జీడీపీపీ లెక్క గడతారు. ఇలా చూస్తే 3,12,998 రూపాయలతో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉండగా  రూ. 2,57,949 తో హైదరాబాద్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మేడ్చేల్ -మల్కాజ్ గిరి జిల్లా రూ.1,04,710తో మూడో స్థానంలో నిలిచాయి. ములుగు జిల్లా రూ.8,873తో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఏ జిల్లా ఏ స్థానంలో ఉంది.. ఎంత జీడీడీపీని సాధించాయో ఈ క్రింది పట్టిక చూడండి.
 
జిల్లాల వారీగా జీడీడీపీ 2023-24 సంవత్సరపు వివరాలు ( కరెంట్ ప్రైస్ రూపాయలలో..)

జిల్లా ర్యాంకు

   

  జిల్లా పేరు

 

గ్రాస్ డిస్ట్రిక్  డొమెస్టిక్  ప్రొడక్ట్ రూపాయలల్లో..

1

  రంగారెడ్డి

 3,17,898

2

 హైదరాబాద్

2,57,949

3

మేడ్చెల్ – మల్కాజ్ గిరి

1,04,710

4

 సంగారెడ్డి

65,190

5

నల్గొండ

53,771

6

 భద్రాద్రి కొత్తగూడెం

42,007

7

నిజామాబాద్

41,768

8

ఖమ్మం

41,756

9

సిద్దిపేట

33,432

10

మహబూబ్ నగర్

32,767

11

సూర్యపేట

32,507

12

కరీంనగర్

30,216

13

పెద్దపల్లి

27,649

14

యాదాద్రి భువనగిరి

26,613

15

 మెదక్

26,420

16

 హన్మకొండ

25,667

17

కామారెడ్డి

24,688

18

జగిత్యాల

24,011

19

నాగర్ కర్నూల్

23,462

20

 మంచిర్యాల

22,094

21

వికారాబాద్

22,066

22

వరంగల్

20,758

23

నిర్మల్

19,774

24

 మహబూబాద్

19,490

25

ఆదిలాబాద్

18,847

26

వనపర్తి

15,547

27

 జోగులాంబ గద్వాల

15,529

28

జనగాం

14,669

29

రాజన్న సిరిసిల్ల

13,981

30

నారాయణ పేట్

13,818

31

 కుమరం భీం ఆసీఫాబాద్

 13,700

32

జయంశకర్ భూపాలపల్లి

12,932

33

 ములుగు

8,873