Hyderabad Heavy Rains: వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా సరైన వర్షాలు హైదరాబాద్ లో పడలేదు. ఆ లోటు తీరేలా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒక్క సారిగా వర్షం ఊపందుకుంది. రెండు గంటలుగా ఆపకుండా పడుతోంది. ఈ కారణంగా పలు చోట్ల.. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 50 మిల్లీ మీటర్ల వరకూ వర్షం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తమ ప్రాంతంలో భారీ వర్షం పడుతోందని.. పలు ప్రాంతాల నుంచి నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావం అని నివేదికలు చెబుతున్నాయి.
భారీగా వర్షం పడటంతో.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలబడటంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండటంతో హెచ్ఎండీ, హైడ్రా సహా ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా పరిస్థితిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు.