Possibilities of dividing Greater Hyderabad into four corporations : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు విస్తరిస్తూ, పరిధిలోని 27 పెరిఫెరల్ అర్బన్ లోకల్ బాడీలను (ULBs) విలీనం చేషశారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. GHMC వార్డుల సంఖ్యను 150 నుండి 300 కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసింది. పట్టణ పాలనను (Urban Governance) మరింత బలోపేతం చేయడంలో భాగంగా, ఈ విస్తరణకు అనుగుణంగా వార్డుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్‌లో 300 వార్డులు
GHMCలో ఇప్పటివరకు ఉన్న 150 వార్డుల స్థానంలో ఇకపై 300 వార్డులు** ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను (ULBs) GHMCలో విలీనం చేయడంతో ఈ మార్పు అనివార్యమైంది. విస్తరించిన GHMC పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (Telangana Core Urban Region)గా పరిగణిస్తున్నారు. వార్డుల సంఖ్య పెంపు ద్వారా ప్రతి వార్డు పరిధి తగ్గి, కార్పొరేటర్లు ప్రజలకు మరింత చేరువగా ఉండటానికి, సమస్యలను త్వరగా పరిష్కరించడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది మెరుగైన పౌర సేవలు , మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం చేయించారు. ఆ నివేదిక ఆధారంగానే ఈ పెంపునకు ఆమోదం లభించింది.
ఇంత పెద్ద నగరం ఒకే కార్పొరేషన్ కింద సాధ్యమా ?
అయితే ఇంత పెద్ద ప్రాంతానికి ఒకే మేయర్ ఉండటం కష్టమని GHMCను డీసెంట్రలైజ్ చేసి మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా విభజించే ప్రణాళికలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం GHMCలో 300 వార్డులు, 300 ఎన్నికైన కార్పొరేటర్లు ఉంటారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి అనుగుణంగా జరిగింది. ప్రస్తుతం GHMC పరిధి 650 చ.కి.మీ.లు మాత్రమే ఉండగా, 27 మున్సిపాలిటీలు, 1 గ్రామ పంచాయతీలను కలిపిన తర్వాత ఇది 2,000 చ.కి.మీ.లకు చేరుకుంటుంది. జనాభా 1.3 కోట్లకు పైగా ఉండగా, ప్రతి వార్డులో 40,000-50,000 మందులు ఉంటారు. సర్కిల్స్ సంఖ్య 30 నుంచి 57కి పెరిగింది. ప్రతి మెర్జ్ అయిన మున్సిపాలిటీని ఒక సర్కిల్‌గా పరిగణిస్తారు. GHMC విస్తరణ తర్వాత, దీనిని మూడు లేదా నాలుగు చిన్న కార్పొరేషన్లుగా విభజించే ప్రణాళికలు ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుత ఒక మేయర్ పదవి కాకుండా నాలుగు మేయర్ స్థానాలతో కార్పొరేషన్లు ఏర్పడే అవకాశం ఉంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మోడల్
మూడు వందల మంది కార్పొరేటర్లతో అంటే పాలన కూడా గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే నాలుగు కార్పొరేషన్లు చేసి..నలుగురు మేయర్లు బాధ్యతలు నిరవహించే అవకాశాలు ఉన్నాయి. వార్డుల సంఖ్య ఖరారు కావడంతో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను GHMC త్వరలో చేపట్టనుంది. ఈ ప్రక్రియలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిపాలనా విభాగాలతో సమన్వయం చేసుకోనుంది. ప్రస్తుత GHMC కౌన్సిల్ టర్మ్ ఫిబ్రవరి 11, 2026కు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశంఉంది. ఇప్పటికి అయితే 300 వార్డులతో ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, BRS, BJP, AIMIM మధ్య తీవ్ర పోటీ జరుగుతుంది. 2020 ఎన్నికల్లో BRS 56 సీట్లు, BJP 48, AIMIM 44, కాంగ్రెస్ 2 సీట్లు సాధించాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.