ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రెండు రైళ్లకు అదనపు కోచ్ లను శాశ్వతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
1. గుంటూరు – తిరుపతి – గుంటూరు రైలు (17261/17262) - ఈ గమ్య స్థానాల మధ్య నడిచే రైలుకు అదనంగా కోచ్‌లు జోడించాలని దక్షిణ మధ్య రైల్వై నిర్ణయం తీసుకుంది. గతంలో 19 కోచ్‌లు ఉండేవి. అదనంగా పెంచిన కోచ్ లతో గుంటూరు - తిరుపతి - గుంటూర మధ్య నడిచే రైలు 01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్‌లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 02-SLR కోచ్ లతో మొత్తం 24 కోచ్‌లతో ఈ రైలు నడవనుంది. గుంటూరు నుండి డిసెంబర్ 18, 2025 నుండి నడవనుండగా , తిరుపతి నుండి డిసెంబర్ 19, 2025 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
2. గుంటూరు – రాయగడ – గుంటూరు రైలు (17243/17244) - ఈ గమ్య స్థానాల మధ్య నడిచే రైలు లోను మార్పులు చేశఆరు. ఈ రైలు గతంలో 20 కోచ్ లు ఉండేవి. పెంచిన కోచ్ లతో ఈ రైలు ఇక నుండి నడవనుంది.ఈ రైలు కూర్పులో మార్పులు చేశారు.
సవరించిన కూర్పు ప్రకారం (Revised Composition) గుంటూరు - రాయగడ - గుంటూరు మధ్యలో01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్‌లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 02-SLR కోచ్ లతో మొత్తం 24 కోచ్‌లతో నడవనుంది. గుంటూరు నుండి డిసెంబర్ 20, 2025 నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, రాయగడ నుండి డిసెంబర్ 21, 2025 తేదీ నుండి పెంచిన కోచ్ లతో రైలు నడవనుంది.
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ (A. Sridhar, Chief Public Relations Officer)ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు - తిరుపతి - గుంటూరు మధ్య నడిచే ఈ రైలును, గుంటూరు - రాయగడ - గుంటూరు మధ్య నడిచే రైలు కోచ్ లు పెంచడం వల్ల ప్రయాణికులకు లబ్ధి చేకూర్చుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.