హైదరాబాద్ జవహార్ నగర్ లో ప్రముఖ యాంకర్ స్వేచ్చ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. స్వేచ్ఛ మృతికి, ఆమెతో సన్నిహితంగా ఉండే పూర్ణచందర్ కారణమని, అతని వల్లనే తాను ప్రాణాలు కోల్పోయిందని స్వేచ్చ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మొదట స్వేచ్చ మృతిని అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు తాజాగా సెక్షన్లు మార్చి , పోక్సో చట్టం క్రింద కేసు నమోదుచేశారు. ఇంతకీ సెక్షన్లు మార్చాల్సిన పరిస్దితులు ఎందుకొచ్చాయి. నిందితుడు పూర్ణచందర్ పై స్వేచ్చ కూతురు చేస్తున్న ఆరోపణలేంటి, ఇదిలా ఉంటే న్యాయవాదితో పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్ సైతం స్వేచ్చకు తనకు మధ్య జరిగింది ఇదేనంటూ మీడియాకు లేఖ విడుదల చేశారు.
స్వేచ్ఛ కూతురు ఆరోపణలు ఇవే..
పూర్ణచందర్ వల్లనే అమ్మ ఆత్మహత్య చేసుకుంది.నేనూ అమ్మ జవహార్ నగర్ లో కలసి ఉండేవాళ్లం. వారంలో మూడుసార్లు మా ఇంటికి పూర్ణచందర్ వస్తుంటేవాడు. అమ్మముందు నాతో మంచిగా ఉన్నట్లు నటించేవాడు. అమ్మ లేని సమయంలో నన్ను అసభ్యంగా తాకడం, లైగికంగా వేధించడం చేస్తుండేవాడు. చాలా సార్లు ఇదే విషయాన్ని అమ్మకు చెప్పాను , తండ్రిలాంటి వ్యక్తి కదా , ప్రేమగా ఉన్నాడేమో అని అమ్మ అంటుండేది. నేను చెప్పే విషయాలు నమ్మలేదు. తన తల్లి స్వేచ్చతో , పూర్ణచందర్ తరచూ గొడవలు పడుతుండేవాడు. వారిద్దరి మధ్య గొడవలు కారణంగా అమ్మ గతంలో ఓసారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో నేను అందుబాటులో ఉండటంతో వెంటనే స్పందించి, రక్షించుకోగలిగాను. నా తల్లి చావుకు కారణమవ్వడంతోపాటు , నన్ను లైంగికంగా వేధించిన పూర్ణ చందర్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.
ఇలా స్వేచ్చ కూతురు ఫిర్యాదు చేయడంతో మొదటల్లో 174 సెక్షన్ క్రింద అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును , స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు పూర్ణచందర్ పై BNS యాక్ట్ 69,108 క్రింత సెక్షన్లు నమోచేశారు. తాజాగా స్వేఛ్చ కూతురు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. 18 సంవత్సరాల లోపు బాలికలపై జరిగే లైంగిక వేధింపులకు కఠిన శిక్షపడేందుకు అమల్లోకి వచ్చిన పోక్సో యాక్ట్ ఇప్పుడు నిందితుడు పూర్ణచందర్ పై నమోదైయ్యింది. ఆరోపణలు రుజువైతే ఈ కేసులో జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయి.
నిందితుడు పూర్ణచందర్ ఏమంటున్నాడంటే..
న్యూస్ యాంకర్ స్వేచ్చ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ , తాజాగా మీడియాకు లేఖను విడుదల చేశారు. స్వేచ్చ చావాలని తాను కోరుకోలేదంటూనే , వారి మధ్య జరిగిన విషయాలను లేఖద్వారా చెప్పే ప్రయత్నంచేశాడు. 2009 నుండి ఓ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్నప్పుుడే స్వేచ్చ నాకు స్నేహితురాలిగా పరిచయమైయ్యింది. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య మొదటి వివాహం సమయంలో, 2016 నుండి 2017 మధ్య రెండవ వివాహంలోనూ స్వేఛ్చ సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. తన బాధను అనేకసార్లు రాతల రూపంంలోనూ తెలియజేసింది.
2017 విడాకుల తరువాత మొదట్లో తల్లిదండ్రుల దగ్గర ఉండేది, తరువాత వారితో విబేధాల నేపధ్యంలో జవహార్ నగర్ లో కూతురితో కలసి ఉంటోంది. 2020లో స్వేచ్చ నాకు దగ్గరైనమాట వాస్తవమే, స్వేచ్చను , తన కూతురుని తానే దగ్గరుండి చూసుకునేవాడ్ని. తన చావుకు నాకు సంబధంలేదంటూ లేఖలో పూర్ణచందర్ తెలిపాడు. ఇలా తల్లిదండ్రులు, కూతురు పూర్ణచందర్ వల్లనే స్వేచ్చ ఆత్మహత్య చేసుకుందని అంటుంటే, ఆమె చావుతో తనకు సంబంధంలేదంటున్నాడు పూర్ణచందర్. ఇప్పటికే పూర్ణ ఫోన్స్ కాల్స్, చాటింగ్ పరీశీలించిన పోలీసులు , స్వేచ్చ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. కూతురి వద్ద స్టేట్ మెంట్ రికార్డు చేసి విచారణ వేగవంతం చేశారు.