Telangana News | హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. దీనిపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది.

Continues below advertisement

తెలంగాణకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లు సమాచారం. అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ  పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ సహా పలువురు నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ అధికారులు సైతం ఉన్నారని తెలిసిందే. 

Continues below advertisement