తెలంగాణలో కరోనా మూడో వేవ్ ప్రారంభం అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటి రేటు ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో 0.5 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా ఒక శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. డిసెంబర్ 26వ తేదీన రాష్ట్రంలో 109 కరోనా కేసులు ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ జనవరి 1వ తేదీకి 317కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కొద్ది రోజుల క్రితం ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 10వ తేదీ వరకు తెలంగాణలో బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన సభలపై నిషేధం విధించారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బీఆర్కేఆర్ భవన్‌లో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు.
Also Read: Viral Video: లోయ అంచులో ఉయ్యాల జంపాల ఆట.. ఇతను జస్ట్ మిస్! ఒళ్లు గగుర్పొడిచే వీడియో
అంతేకాకుండా కరోనా నిబంధనల్లో భాగంగా మాస్క్‌లను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని పాఠశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకు కూడా జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. జవవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుంచి 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వేయనున్నారు.
కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు శనివారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయానికి దాదాపుగా 123 మంది ప్రయాణికులు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చారు. వారికి కొవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో 10 మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే వారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా వారితో పాటు మరో ఇద్దరూ ఒమిక్రాన్ బారిన పడినట్లు తేలింది.
తెలంగాణలో కరోనా కేసులు
మరోవైపు, తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 28,886 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,215కి చేరింది.
Also Read: Desam Aduguthondhi: మధ్యపాన నిషేధం, రాజధాని అంశం, రైతుల సమస్యలు.. ఈ ఏడాదైనా క్లారిటీ వస్తుందా?
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తుండటం, వీళ్లలోనే 70 శాతం ఒమిక్రాన్ కేసులు బయటడిన నేపథ్యం లో కొత్త వేరియంట్ ఇప్పటికే కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కేసుల్లోనూ ఒమిక్రాన్ ఉండొచ్చని భావిస్తున్నాయి. సంక్రాంతి రాకపోకలు పెరుగుతుండటం, పైగా ప్రజలు కరోనా జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండు వారాల్లో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ రూ.6 వేలు!
ప్రస్తుతం కరోనా ఉందా లేదా తెలుసుకొనేందుకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ పరీక్షలతో గుర్తిస్తున్నారు. అయితే వైరస్‌ను నిర్ధారించినా అందులోని వేరియంట్ గుర్తించాలంటే మాత్రం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలు హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), సీడీఎఫ్‌డీ (సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్), గాంధీ ఆస్పత్రుల్లోనే చేస్తున్నారు. సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంస్థల పరిధిలో నెలకు సగటున 6 వేల జీనోమ్ సీక్వెన్సింగ్‌లు చేసే సామర్థ్యం ఉంటుంది. తెలంగాణ, ఏపీలతో పాటు ఉత్తర కర్ణాటక రీజియన్ పరీక్షలు కూడా వీరే చేస్తున్నారు. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ విలువ రూ.6 వేల వరకు ఉంటుందని సమాచారం. శాంపిల్ తీసుకున్నాక 4 దశల్లో విశ్లేషణ చేసి ఫలితాలు తేల్చాల్సి ఉంటుంది.
Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి