Noro Virus : హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్, డీపీహెచ్ అధికారుల కీలక ప్రకటన

Norovirus Symptoms:నొరోవైరస్ వ్యాప్తి పై హైదరాబాద్‌లోని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు స్పందించారు. వదంతులను నమ్మవద్దని, మోసపోవద్దని డిపిహెచ్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ప్రజలకు సూచించారు.

Continues below advertisement

Noro Virus : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను రోజుకో కొత్త వైరస్ భయపెడుతుంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వేగంగా విస్తరిస్తోంది.  ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో  పరిసరాలన్ని వాన నీటికి దుర్గంధంగా మారటంతో.. రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ నొరో వైరస్ అందరినీ భయపెడుతోంది. 

Continues below advertisement


స్పందించిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్
నొరోవైరస్ వ్యాప్తి చెందుతుందనే నివేదికలపై హైదరాబాద్‌లోని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు స్పందించారు. నోరోవైరస్ కు సంబంధించిన వదంతులను నమ్మవద్దని, మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ప్రజలకు సూచించారు.  ఇప్పటివరకు పాతబస్తీలోకి ఒక్క వ్యక్తికి కూడా నొరో వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలలేదన్నారు.  కాకాపోతే లక్షణాలు మాత్రం దానికి దగ్గరగా ఉన్నాయి.  పాత బస్తీలోని కుటుంబాలు నొరో వైరస్ వ్యాప్తి చెందుతోందని , ఈ వ్యాధి ప్రాణాంతకమని వస్తున్న పుకార్లను నమ్మవద్దని  డాక్టర్ నాయక్ అన్నారు. రోటోవైరస్ లేదా నోరోవైరస్ వల్ల పెద్దలు , పిల్లలలో ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి.  ఋతుపవనాల సమయంలో అనేక బ్యాక్టీరియా , వైరల్ ఇన్ఫెక్షన్లు  వస్తుంటాయి. ఇవి సన్నిహిత సంబంధాలు, కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం  ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధులన్నింటినీ చికిత్స ద్వారా నయం చేయవచ్చు.  మూడు రోజుల్లో ప్రజలు కోలుకుంటారు. పాతబస్తీలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నొరోవైరస్‌ని నివేదించినట్లు సమాచారం అందింది. అయితే, ఇవన్నీ అనుమానిత కేసులు , ఎవరికీ పాజిటివ్ వచ్చినట్లు రుజువు కాలేదని డాక్టర్ నాయక్ చెప్పారు. ముందుజాగ్రత్తగా  గత వారం రోజులుగా, స్థానిక జిల్లా వైద్య , ఆరోగ్య అధికారులు (DMHO) పాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అనేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 


నొరో  వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది
నొరో వైరస్ సోకడానికి.. కలుషిత నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కలుషిత నీటితో పాటు నాణ్యతలేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకినవారికి.. చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇదొక రకమైన అంటువ్యాధి కావటంతో.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

నొరో వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 అయితే... నొరో వైరస్ సోకకుండా  పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి, తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు. వేడినీరు తాగడం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి ఆహారం, శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే దుస్తులను వేడి నీటితో ఉతకాలి. వైరస్ సోకిన వ్యక్తి అది తగ్గే వరకు దూరంగా ఉండాలి.

Continues below advertisement
Sponsored Links by Taboola