Nikhat Zareen: ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్. స్పోర్ట్స్ అథారిటిక్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, కుటుంబ సభ్యులు... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ మరీ నిఖత్ కు స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగానే నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ లో రెండవసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తన విజయానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపింది. 


బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ - ప్రశంసల వెల్లువ




బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో గోల్డ్ సాధించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.  


ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 


క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్‌ జరీన్‌కు మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయాలకు భారత్‌ గర్వపడుతోందని ఆయన ట్వీట్‌ చేశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్‌ ఖరీన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడిందన్నారు. బంగారు పతకం సాధించి దేశాన్ని గర్వపడేలా చేసిన నిఖత్‌ జరీన్‌కు కంగ్రాట్స్ అని కవిత తెలిపారు.