Asaduddin Telugu :  రాజాసింగ్ విడుదల చేసిన వీడియోతో ఏర్పడిన వివాదం కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి ఎంతకూ తగ్గలేదు. ఈ పరిస్థితులపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైపీ స్పందించారు. బీజేపీ ఉప ఎన్నికల కోసమే ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. ఉపఎన్నికల కోసమే ఇంత బరి తెగిస్తే.. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేస్తారా అని ప్రశ్నించారు. కర్ఫ్యూ వాతావరణం  సృష్టించి..  రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకుంటున్నారా అని మండిపడ్డారు.  దేవుడి దయతో ఇవన్నీ జరగకూడదని..  బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి విముక్తి పొందాలని ఆయన కోరుకున్నారు. 



బీజేపీ ఎంపీ తన స్పందనను తెలుగుతో పాటు ఇంగ్లిష్, ఉర్దూలోనూ పోస్ట్ చేశారు.  





హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సామాన్యంగా తెలుగులో ట్వీట్ చేయరు.  ఇటీవలి కాలంలో ఆయన తెలుగులో ట్వీట్ చేసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు పరిస్థితి సున్నితంగా మారడంతో ..   తన అభిప్రాయాన్ని తెలుగులో కూడా చెప్పారు. అంతా బీజేపీ వల్లే జరుగుతోందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ.. అది కంటి తుడుపు మాత్రమేనని....  ఆయన భావిస్తున్నారు.


రాజాసింగ్ వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందిస్తున్నారు.   ఉద్దేశపూర్వకంగానే బీజేపీ అల్లర్లు సృష్టిస్తోందని అంటున్నారు. పాతబస్తీలో పరిస్థితులపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్, చేస్తున్నారు. శాంతి భద్రతల అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఈ విషయంలో అందరూ  సంయమనం పాటించాలని ఆయన కోరుతున్నారు.


రాజకీయంగా మాతో రాజకీయంగా పోరాడండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. మతపరమైన అల్లర్లను ప్రేరేపించవద్దు సమాజాన్ని అవమానించడం బీజేపీ అధికారిక విధాన అని రెండు రోజుల కిందట అసదుద్దీన్ విమర్శించారు.  రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే వారు స్పందించాలని డిమాండ్ చేశారు.