Krishna River Water News: హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణా నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్దాలు మాట్లాడారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS Party) నేతలకు పరిపాలన చేతకాకపోవడం, వారి అసమర్థత వల్లనే కృష్ణా నదీ (Krishna River) జలాల్లో తెలంగాణ రైతులకు న్యాయం జరిగిందని విమర్శించారు.


మెయింటెనెన్స్ కింద రూ.200 కోట్లు కేటాయింపులా? 
ఏ ప్రతిపదికన తీసుకున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తప్పు అన్నారు ఉత్తమ్. లాస్ట్ వాళ్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆన్ రికార్డ్స్ లో కే ఆర్ ఎం బీ (KRMB) కి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఈ 56 రోజుల పాలన లో మేము ఎక్కడ ఒప్పుకోలేదు అన్నారు. 5 మే 2020 న ఏపీ జీవో నెంబర్ 203 ద్వారా విడుదల చేసి రోజుకు 8 టీఎంసీల నీటిని తీసునేలా జోవో ఇచ్చిందని తెలిపారు. Appex కౌన్సిల్ కి ఏపీ, తెలంగాణ సీఎం లని పిలిస్తే వెళ్ళలేదని ఉత్తమ్ అన్నారు. 


సీఎంగా కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లలేదన్న మంత్రి ఉత్తమ్ 
ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోటానికి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టడానికే ఆ మీటింగ్ కి వెళ్ళలేదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 10 ఏళ్ళ లో పూర్తి చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. తెలంగాణలో నీటి కేటాయింపుల్లో మోసం, KRMB కి ప్రాజెక్ట్ లు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లు అని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ గ్రావిటీ ద్వారా రావాల్సిన 8 టీఎంసీల కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ వ్యక్తిగతంగా మాట్లాడుకుని ఏపీకి అప్పగించారని ఆరోపించారు.


తమ ప్రభుత్వ వైఖరి కేంద్రానికి స్పష్టం చేశామని క్లారిటీ 
మేము KRMBకి ఎట్టి పరిస్థిలో ప్రాజెక్ట్ లు ఇవ్వడానికి ఒప్పుకోము, ఇటీవల ఇదే విషయాన్ని తమ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ని కలిసి కూడా ప్రాజెక్ట్ లను కేంద్రం పరిధికి అప్పగించం అని ఖరాకండిగా చెప్పామని తెలిపారు. తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ నేతల వల్ల కాదు, చిదంబరం కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించడం వల్లే రాష్ట్ర సాధన సాకారమైందన్నారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడి సీఆర్పీఎఫ్ ని నాగార్జున సాగర్ డాం మీదకు పంపి కుట్ర చేశారని.. రాజకీయంగా కుట్ర చేయడానికి మాజీ సీఎం ఆడిన నాటకం అని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు.


Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుంది: విజయసాయిరెడ్డి జోస్యం