Minister Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం బహుభాషా కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ప్రతిభ కనబరిచిన కవులను సన్మానించి పురస్కారాలను అందజేశారు. 33 జిల్లాల్లో కవి సమ్మేళనాలు  రాష్ట్రస్థాయిలో అవార్డులు ఇచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కనిపిస్తుందని చెప్పారు.         


నాటి ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయాల కోసం మనల్ని వాడుకున్నామని విమర్శించారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య దినోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరేటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య, మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపిక రెడ్డి, అధికార భాష సంఘం చైర్మన్ శ్రీదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మరియు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.






ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో గౌడ సంక్షేమ సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ గారితో కలసి మంత్రి శ్రీరనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, రామారావు గౌడ్, జైహింద్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రామ్మోహన్ గౌడ్, వేములయ్య గౌడ్, శ్రీధర్ గౌడ్, లక్ష్మీప్రసన్న గౌడ్, భరత్ గౌడ్, జగన్ గౌడ్, రాజశేఖర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.