మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని, ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి  పిలుపునిచ్చారు.






‘‘మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే.. డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా మంత్రి హరీశ్ రావు పారిశుధ్యం నిర్వహించారు. ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాల’’ని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.


డెంగ్యూ లక్షణాలు ఇవీ..
అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలు వాడాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. 
లక్షణాలు
తీవ్రమైన జ్వరం
తీవ్రమైన తలనొప్పి
కంటి లోపల భాగంలో నొప్పి, వాంతులు, విరోచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు
చర్మంపై దద్దుర్లు (తీవ్రమైన కేసుల్లో మాత్రమే)
పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం (తీవ్రమైన కేసుల్లో మాత్రమే) డెంగ్యూ హేమరేజిక్ (రక్తస్రావం) జ్వరం






డెంగ్యూ వ్యాధి నిర్ధారణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయబడుతును
జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు NS 1 ఎలీసా, ఆరవ రోజు నుంచి IgM తర్వాత IgG ఎలీసా పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో (బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) ఉచితంగా చేస్తారు.






హైదరాబాద్‌‌లో మరో ప్రకృతి వైద్యశాల
కార్పొరేట్ లుక్స్ తో మారిపోయిన హైద‌రాబాద్‌లో కొన్నేళ్లుగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. త్వర‌లో ప్రభుత్వ ప్రకృతి వైద్యశాల అందుబాటులోకి రానుంది. ఈ మేర‌కు తెలంగాణ వైద్య మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు. త్వర‌లోనే అందుబాటులోకి రానున్న ఈ ప్రకృతి వైద్యశాల ఏకంగా 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.6 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నేచ‌ర్ క్యూర్‌గా పేరు పెట్టనున్న ఈ వైద్యశాల నిర్మాణ ప‌నుల‌ను త‌క్షణ‌మే ప్రారంభించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.