Just In
Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు తగ్గింపు - పెంచిన దాంట్లో పదిశాతం -కొత్త రేట్ల వివరాలు
Hyderabad: మెట్రో చార్జీలను శుక్రవారం నుంచి కొద్ది మొత్తంలో తగ్గించనున్నారు. కానీ పెంచిన దాంట్లో అతి స్వల్ప మొత్తాన్నే తగ్గిస్తున్నారు.
Metro fares reduce: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను తగ్గించాలని నిర్ణియంచారు. ఇటీవల పెంచిన టికెట్ ధరలను 10% తగ్గిస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు శుక్రవారంం నుంచి అమలులోకి వస్తుంది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మెట్రో సేవలను మరింత మంది వినియోగించేలా చేయడానికి ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
శుక్రవారం నుంచి హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇలా ఉంటాయి.
- 0-2 కి.మీ : రూ.12 నుంచి రూ.11
- 2-4 కి.మీ : రూ.18 నుంచి రూ.17
- 4-6 కి.మీ : రూ.30 నుంచి రూ.28
- 6-9 కి.మీ : రూ.40 నుంచి రూ.37
- 9-12 కి.మీ : రూ.50 నుంచి రూ.47
- 12-15 కి.మీ : రూ.55 నుంచి రూ.51
- గరిష్ఠ ధర: రూ.75 నుంచి రూ.69
ఈ సవరించిన ధరలు మూడు మెట్రో కారిడార్లలోని అన్ని జోన్‌లకు వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు. 2025 మే 17 నుంచి మెట్రో ఛార్జీలను పెంచారు. కనీస ధర రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కి పెంచారు. ఈ ధరల పెంపుపై ప్రయాణికులు, విపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సీపీఐ ), హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం వంటి సంస్థలు ధరల రద్దు కోసం ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాయి.
కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో ఆదాయంపై ప్రభావం పడిందని అలాగే పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా ఛార్జీలు పెంచతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, వారి ఆర్థిక సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ 10% డిస్కౌంట్ ప్రకటించింది.
సీపీఎం వంటి పార్టీలు తగ్గింపు సరిపోదని, పెంచిన ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో ప్రయాణికుడిపై నెలకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అదనపు భారం పడుతుందని విమర్శించారు. దీంతో పది శాతం తగ్గించాలని నిర్ణయించారు. .