Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం

Chiranjeevi Reached Allu Arjun Home | నటుడు అల్లు అర్టున్ అరెస్టుతో అప్పటికప్పుడు చిరంజీవి షూటింగ్స్ రద్దు చేసుకున్నారు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంసభ్యులను పరామర్శించారు.

Continues below advertisement

Pushpa 2 Hero Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో కుదుపు వచ్చింది. ఆయన అరెస్టు అయిన సంగతి తెలుసుకున్న వారంతా స్పందిస్తున్నారు. మరోవైపు మెగా స్టార్‌ చిరంజీవి తన షూటింగ్స్ రద్దు చేసుకున్నారు. విశ్వంభర షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి సెట్ నుంచి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మొదట హాస్పిటల్‌కు, లేక నాంపల్లి కోర్టుకు వస్తారని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అదే సమయంలో ఇటు చిరంజీవి తన షూటింగ్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. చిరంజీవి, నాగబాబు ఇద్దరూ అల్లు అర్జున్‌ కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు.

Continues below advertisement

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట

ప్రపంచ వ్యాప్తంగా 12 వేలు పైగా స్క్రీన్లలో విడుదలైన పుష్ప 2 ఘన విజయం సాధించింది. అయితే పుష్ప 2 సినిమాలకు విడుదలకు ముందు రోజు డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ లోని సంథ్య థియేటర్ లో ప్రదర్శించిన ప్రీయిర్ షోకు హీరో అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ ను చూడాలని, ఆయనతో సెల్ఫీలు తీసుకోవాలని ఫ్యాన్స్ ఎగబడటంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అక్కడిక్కడే మృతిచెందారు. మహిళా అభిమాని, ఆమె కుమారుడు స్పృహ తప్పడంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మహిళ అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ఆమె కుమారుడ్ని మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

హీరో అల్లు అర్జున్ అరెస్ట్ 

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై 105, 118 (1) రెడ్ విత్ 3/ 5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం తెలిసిందే.

Also Read: Actor Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్‌ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు

Continues below advertisement