Medicover Fertility Health Camp: 16 నవంబర్ 2024 హైదరాబాద్‌లో మెడికోవర్ ఫెర్టిలిటీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. సంతానోత్పత్తి పరిష్కారాలు, చికిత్సపై ఉన్న అనుమానాలు ఈ శిబిరంలో నివృత్తి చేయనుంది. శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరం మధ్యాహ్నం 3 గంటల వరకు హై-టెక్ సిటీలోని క్లినిక్‌లోనే జరగనుంది.
సంతానలేమితో బాధపడుతున్న వాళ్ల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వ్యక్తిగతంగా లేదా జంటగా వచ్చి అనుమానలు తీర్చుకోవచ్చు. ఇక్కడే చికిత్స తీసుకున్న వాళ్లకు ప్రత్యేక రాయితీ కూడా ఇవ్వబోతున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. అనేక రోగనిర్ధారణ పరీక్షలు, వైద్య కన్సల్టెన్సీ కూడా ఉంటుంది. నేరుగా వైద్యులతో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది.
ఈ శిబిరానికి హాజరయ్యే మహిళలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP), హేమోగ్రామ్, ప్రోలాక్టిన్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH), యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) సహా అవసరమైన పరీక్షలపై 50 శాతం తగ్గింపు ఇస్తోంది. వీటితోపాటు సమస్యల పరిష్కారాల గురించి తెలుసుకునేందుకు అక్కడే వైద్యులను ఉచితంగా కూడా సంప్రదించవచ్చు. అవసరమైన వాళ్లకు సంతానోత్పత్తికి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా చేస్తారు.
క్యాంపునకు హాజరయ్యే పురుషులకు చేసే CBPపై 50% తగ్గింపు ఉంటుంది. వీళ్లు కూడా వైద్యుడిని ఫ్రీగానే సంప్రదించవచ్చు. పురుషులకు ఉచిత వీర్య విశ్లేషణ, సంతానోత్పత్తికి సంబంధించిన కీలక అంశాలపై విశ్లేషణలు పొందవచ్చన్నారు.
సంతానం కలగలేదని బాధపడుతున్న జంటలకు ఇక్కడ పరీక్షలు చేయనున్నారు. వారికి 50 తగ్గింపు ఇస్తారు. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ (IUI) విధానాలపై 50శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)పై గణనీయమైన 20,000 రూపాయల వరకు తగ్గిస్తారు.
శిబిరంలో అందుబాటులో వైద్యులు
డా. నిధి శర్మ – MBBS, MD, DNB (అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ), న్యూ ఢిల్లీలోని ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ (IFS) నుంచి క్లినికల్ ARTలో డిప్లొమా పొందారు.
డా. K మాధురి – MS, FRM (OSHERM), OBG (గాంధీ), ఫెర్టిలిటీ సొల్యూషన్స్‌లో కన్సల్టెంట్
దీనిపై పూర్తి సమాచారం కోసం వినోద్ +91 7669406742 / 040 68334455 నెంబర్లకు ఫోన్ చేయాలి.