Student commits suicide: నా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ ఏం అనొద్దు. పోలీసులు కూడా నా ఆత్మహత్య కేసుపై విచారణ జరపొద్దు. అలాగే నా స్నేహితులను కూడా ఈ కేసులోకి లాగొద్దు. ఎవరికీ నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలియదు... అమ్మా నాన్న సారీ.. మిస్ యూ ఆల్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ చదువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఇతని తండ్రి వినోద్ నాందేడ్ లోనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేడ్చల్ జిల్లా చీర్యాల గ్రామ పరిధిలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో.. ఫార్మసీ చదువుతున్న అక్షయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు ఉదయమే అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అక్షయ్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తాను ఎందుకు చనిపోతున్నది గుర్తించారు. అయితే అక్షయ్ ఆర్మీలో జవాన్ గా సెలెక్ట్ కాదా.. ఆ ఉద్యోగానికి వెళ్లొద్దని అతడి తల్లిదండ్రలు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.




వాట్సాప్ స్టేటస్ లో ఏమని రాశాడంటే..?


ఇట్స్ మై లైఫ్ మై విష్. నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ప్లీజ్ డోంట్ బ్లేమ్ ఎనీవన్ దిస్. పోలీస్ అంకుల్ ప్లీజ్ డోంట్ డు ఎనీ ఇన్వెస్టిగేషన్ అండ్ జీపీసీ ఫెల్లోస్ డోం కన్సీల్ మై ఫ్రెండ్స్. దె డోంట్ నో ఎనీథింగ్. సారీ ఆయి అండ్ బాబా. లవ్ యూ సో మచ్ ఆల్. మిస్ యూ ఆల్. మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.


నిజామాబాద్ లో ఇటీవలే మెడికల్ విద్యార్థి బలవన్మరణం


నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం (మార్చి 31) ఉదయం జరిగింది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఎం. సనత్ అనే 21 ఏళ్ల యువకుడు హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియలేదు. సనత్ పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫైనల్ పరీక్షలు పూర్తిచేసి ప్రాక్టికల్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి మాసంలో అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.