Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలుపై ఎల్‌అండ్‌ టీ కీలక ప్రకటన చేసింది. నష్టాలతో మెట్రో నిర్వహణ తమ వల్ల కాదని తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. నష్టాలను భరించలేని స్థాయికి వెళ్లినపోయినట్టు కేంద్రానికి రాసిన ఓ లేఖలో వెల్లడించింది. దీంతో మెట్రో విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Continues below advertisement

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు రేవంత్ సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే డీపీఆర్ పంపించిన అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్‌ అండ్‌ టీ భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు నడుస్తున్న మెట్రో లేన్‌పై కీలక విషయాలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్‌లలో నడుస్తోంది. ఏది కూడా లాభాల్లో లేదని కేంద్రానికి ఎల్‌ అండ్‌టి వివరించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నడిపే సాహసం చేయలేమని తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొందని అంటున్నారు. ఎస్పీవీ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తే నడపడానికి తమకు అభ్యంతరం లేనట్టుగా తెలిపిందట.    పెండింగ్‌లో ఉన్న విస్తరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న తరుణంలో వాస్తవ పరిస్థితి తెలియజేయాలని ఎల్‌ అండ్‌ టీకి కేంద్రం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎల్‌ అండ్‌ టీ ప్రస్తుతం నడుస్తున్న రూట్‌లలో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లించడానికే సరిపోవడం లేదని అన్నారు. టికెట్ ధరలు కూడా పెంచుకునే అవకాశం లేకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా రావడం లేదని  ఇలా వివిధ కారణాలతో నష్టాల్లో కురుకుపోయినట్టు  వెల్లడించారు.   

దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి 2017లో హైదరాబాద్‌ మెట్రోను ప్రారంభించారు. 2020 నాటికి ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఎల్‌ అండ్ టీకి ఇవ్వాల్సి ఉంది. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కూడా ఇవ్వడం లేదని లేఖలో తెలిపారు. ఇలా రోజు రోజుకు బకాయిలు పేరుకుపోయి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా మారుతోందని పేర్కొన్నారు. అందుకే తమ వాటాను విక్రయించేందుకు సిద్ధమని ఎల్‌ అండ్‌టీ పేర్కొంది. నష్టాలతో ఎన్నో రోజులు నడపలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఈ లేఖ మెట్రో విస్తరణ పడుతుందనే చర్చ నడుస్తోంది. 

Continues below advertisement