Cloud bursts in some areas of Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.  పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై, ట్రాఫిక్ సమస్యలు, నీటి నిలిచిపోవడం వంటి అసౌకర్యాలు ఏర్పడ్డాయి.  రాజేంద్రనగర్, శంషాబాద్, చంద్రాయణగుట్ట, బాలాపూర్ వంటి ప్రాంతాల్లో  తేలికపాటి వర్షాలు కురిశాయి. దక్, సిద్దిపేట్, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యాయి.  వనస్థలిపురం వైపు క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉందని.. 100మిల్లీ మీటర్ల వరకూ వర్షాలు పడవచ్చని నిపుణులు అంచనా వేశారు. 

హైదరాబాద్‌లో   మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా.  ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఒక్కోచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు.  

సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షణం కారణంగా పలు ప్రాంతాల్లో నీళ్లు నిలబడిపోయాయి.  ఎల్బీనగర్ వైపు భారీ వర్షాలు పడటంతో విజయవడా హైవేపై నీళ్లు నిలబడిపోయాయి.  

 హైదరాబాద్‌లో ఈ రాత్రికి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సలహాలిస్తున్నారు.  గ్రేటర్ మాన్సూన్ బృందాలు..  అలర్టయ్యాయి.