Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీలు చారుకేశవని తీసుకొని ఇంటికి వస్తారు. వసుధ భర్తని పట్టుకొని ఏడుస్తుంది. కేసు వాయిదా పడింది.. రేపటిలో సాక్ష్యాలు సంపాదించాలి.. లేదంటే బావని శిక్ష పడుతుందని సహస్ర అంటుంది. దానికి చారుకేశవ లక్ష్మీ ఉంది కదా విహారికి ఈ ఇంటికి ఏం కాకుండా చూసుకుంటుందని అంటాడు. 

పద్మాక్షి లక్ష్మీని పొగడటం ఆపేయండి అని అంటుంది. దానికి చారుకేశవ మీకు ఎవరో సరిగా చెప్పలేదు చివరి నిమిషంలో తనే మమల్ని కాపాడింది అని అంటాడు. విహారి అందరితో చివరి నిమిషంలో లక్ష్మీ ఇన్సూరెన్స్ టాపిక్ తీసుకొచ్చి మనల్ని కాపాడింది.. తను చేసిన మంచి గుర్తించకపోయినా పర్లేదు.. తప్పుగా మాత్రం అనుకోవద్దు అని విహారి అంటాడు. అవును మనల్ని టార్గెట్ చేసి ఇదంతా చేసింది ఎవరు అని పద్మాక్షి అడుగుతుంది. దానికి లక్ష్మీ అమ్మా చాలా దగ్గరి మనుషులే ఇదంతా చేశారని అంటుంది. 

పద్మాక్షి విహారితో వాళ్లు ఎవరో కనుక్కో నా ఇన్ఫ్యూలన్స్ అంతా వాడి వాళ్లని అతఃపాతాళంలోకి తొక్కేస్తా అంటుంది. వాళ్లని వదలను అని విహారి అంటే వాళ్ల పాపాన వాళ్లు పోతారు అని యమున అంటుంది. ఆ పాపాత్ముల్ని పట్టుకొని వెంటనే శిక్ష వేయాలి అని చారుకేశవ అంటే నన్ను పట్టుకోవడం మీ తరం కాదు అని అంబిక అనుకుంటుంది.

లక్ష్మీ గదిలోకి వెళ్లి విహారిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో యమున వచ్చి ఎందుకు విడాకులు ఇవ్వకుండా గుడికి రమ్మని జడ్జి చెప్పారు అని లక్ష్మీని అడుగుతుంది. అదే అర్థం కావడం లేదని లక్ష్మీ అంటుంది. ఆ మాటలు విన్న వసుధ వదినా నువ్వు ఇంత స్వార్థంగా ఎలా మారిపోయావ్ అని అడుగుతుంది. ఇదంతా మన ఫ్యామిలీ కోసమే చేస్తున్నా అని యమున అంటుంది. మన కోసమా తనే లేకపోతే ఈ రోజు నీ కొడుకు నా భర్త బయటకు రారు.. తనని బాధ పెట్టడం కరెక్ట్‌ కాదు అని అంటుంది. నిజం దాయడం నా తప్పు అని లక్ష్మీ అంటుంది. ఎవరు తన భర్త ఎదురుగా ఉన్నా ఇలా ఉండరు.. తన స్థానంలో మరొకరు ఉంటే ఎలా ఉంటారు వదినా.. విహారి తన మెడలో తాళి కట్టి తనకు శాపం పెట్టేశాడు. తనకు ఇక్కడుండటం ఇష్టం ఆ చిన్న ఆశని దూరం చేస్తారా అని అంటుంది. 

లక్ష్మీ ఏడుస్తూ యమునమ్మ నాకు ఆశ్రయం ఇచ్చారు.. నేను హ్యాపీగా విడాకులు ఇస్తాను.. నాకు బతకడానికి ధైర్యం ఇచ్చారు. నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చారు నేను బతికేస్తాను.. నాకు విహారి గారి సంతోషం కవాలి ఈ కుటుంబం సంతోషం కావాలి అని అంటుంది. వసుధ లక్ష్మీతో నా మనసు బలంగా నువ్వు విహారి విడిపోరని చెప్తుంది. అలా జరగకపోతే ఆ దేవుడు లేనట్లే అని అంటుంది. 

లక్ష్మీ ఏడుస్తుంది. విహారి ఆలోచిస్తూ బాధ పడతాడు. విహారి చనిపోయి కార్మికుల డిటైల్స్ కావాలని.. లాస్ట్ నెలగా ఎవరిని కలిశారో డిటైల్స్ కావాలి అని మేనేజర్‌కి అడుగుతాడు. అంబికను పిలిచి మీరు ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లు జాయిన్ అయ్యారు కదా వాళ్ల డిటైల్స్ కావాలి అంటాడు. ఎందుకు అని అంబిక అడిగితే అంత హై వ్యాల్యూ మన షేర్ వాల్యూకి ఆరింతలు పెట్టి కొన్నారని అంటాడు. నాకు తెలీదు ఇప్పుడు భయంగా ఉందని నటిస్తుంది. అంతా నేను చూసుకుంటా వాళ్ల డిటైల్స్ ఇవ్వండి అని విహారి అంటాడు. విహారి అంతా తవ్వుతున్నాడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అంబిక అనుకుంటుంది.

చారుకేశవ, లక్ష్మీ రాత్రి స్కూటీ మీద చనిపోయిన కార్మికులు ఇంటికి వస్తారు. వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడుతుంది.ఇంటి నిండా సరుకులు కూరగాయలు బియ్యం బస్తాలు చూసి లక్ష్మీకి డౌట్ ఇస్తుంది. లక్ష్మీ బయటకు వెళ్లగానే చనిపోయారని చెప్పిన ఇంటాయన వచ్చి కొడుకుకి చాక్లెట్లు బొమ్మలు ఇస్తాడు. లక్ష్మీ చారుకేశవతో ఇంటి నిండా సరుకులు ఉన్నాయ్ చూశారా అంటే కొంత మంది అలా పెట్టుకుంటారని చారుకేశవ అంటాడు. ఇక లక్ష్మీ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఎంతైనా సాయం చేద్దాం అని అంటుంది. చారుకేశవ డబ్బులు ఇవ్వడంతో ఇద్దరూ వెళ్తారు. 

లక్ష్మీ మళ్లీ డోర్ కొట్టడంతో ఇంటాయన దాక్కోవడంతో ఆవిడ డోర్ తీసి తిట్టి పంపేస్తుంది. లక్ష్మీ చారుకేశవతో ఇంట్లో ఎవరో ఉన్నారు బాబాయ్‌ అప్పటి వరకు ఏడ్చిన పిల్లాడు ఏడ్వడం ఆపేశాడు అని అంటుంది. ఇంతలో విహారి కాల్ చేసి వస్తానని అంటాడు. లక్ష్మీ ఎస్‌ఐ సంధ్యకి కాల్ చేసి సాయం చేయమని చనిపోయిన కార్మికుల డెట్ సర్టిఫికేట్ల గురించి అడుగుతుంది.  సంధ్య సరే అంటుంది. విహారి లక్ష్మీ వాళ్లతో కలిసి మాట్లాడుతాడు. ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. లక్ష్మీని రమ్మని పిలిస్తే లక్ష్మీ చారుకేశవతో మనం వెళ్దాం పదండి బాబాయ్ అంటుంది. విహారి షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.