Bigg Boss Telugu 9 Day 4 Sep 11 Promo 1 : బిగ్‌బాస్ సీజన్ 9 నాలుగో రోజుకు చేరుకుంది. ఎపిసోడ్స్‌ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు బిగ్‌బాస్ లవ్ ట్రాక్‌ని షురూ చేసినట్లే కనిపిస్తుంది. తాజాగా నామినేషన్స్, ఏడ్పులు, బూతులతో వచ్చిన కంటెస్టెంట్లు ఇప్పుడు లవ్ ట్రాక్‌తో వచ్చినట్లు కనిపిస్తుంది. తాజా విడుదలైన ప్రోమోలో లవ్ట్రాక్ని చూఛాయగా చూపించి.. ఇమ్మూ కామెడీ ట్రాక్‌ని రిలీజ్ చేశారు. మరి ఈ సీజన్లో లవ్ ట్రాక్ ఎంతవరకు నడుస్తుందో.. ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ డే 4 ప్రోమో.. లవ్ ట్రాక్!?
ప్రోమోలో కిచెన్ క్లీనింగ్ చేస్తోన్న రీతూ కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే డిమోన్ పవన్ ఉంటాడు. అయితే ఈ భామ అక్కడ కడాయిని కడిగి.. దానిని పవన్‌కి చూపించి.. చూడు నీ ముఖమే కనిపిస్తుంది అని చెప్పడంతో ప్రోమో మొదలైంది. దీంతో పవన్ నవ్వుకుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హరీశ్.. ఫ్లోరా గారు ఇచ్చారు పెన్సిల్లా ఉంటుంది నువ్వేమైనా తీశావా అంటూ రీతూని అడుగుతాడు. ఐ బ్రో పెన్సిల్.. నేనైతే చూడలేదని చెప్తుంది రీతూ. చూశావా అని అడగలేదు తీశావా అన్నాను అంటే.. దొంగతనం చేయడం మా ఇంటా.. వంటా లేదని చెప్తుంది. అంతటితో ఆగకుండా మేము హార్ట్స్ తప్పా మనుషుల వస్తువులను దొంగతనం చేయమంటూ చెప్తుతుంది. దీనికి హరీశ్ కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతారు. ఎప్పుడో చెప్పేశాము ఇవన్నీ అంటారు.
ఇమ్మూ కామెడీ
కమెడియన్ ఇమ్మాన్యూయేల్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు లేడీ గెటప్‌లో ముస్తాబయ్యాడు. ఉప్పల్ బాలు తరహాలో హాయ్ గాయ్స్ అంటూ అందరినీ పలకరించాడు. షాకయ్యారా అంటూ అడిగే సరికి నిజంగానే కిచెన్‌లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఇమ్మూకి హజ్బెండ్‌గా పవన్ అని చెప్తూ కామెడీ చేశాడు. నా పేరు సు. నేను జుట్టుకి లెమన్ వాటర్ తీసుకుంటాను అంటూ కామెడీ చేశాడు. ఈలోపు శ్రీజ మీ ఆయన ఏదో మాట్లాడతాడంటా అంటే.. పవన్‌ని ఉద్దేశించి.. మా ఆయన పెళ్లి చూపులప్పుడు కూడా పెద్ద మాట్లాడట్లేదంటూ కామెడీ చేశాడు.
నవ్వుకుంటూ పవన్ సైడ్‌కి వచ్చిన రీతూని చూసి.. ఏయ్ నువ్వటేళ్లు.. నీకన్నీ నా కాఫీనే కావాలి.. నా మొగుడే కావాలి అనేసరికి అందరూ నవ్వేశారు. అయితే ఈ సీజన్లో రీతూకి, పవన్‌కి లవ్‌ట్రాక్ పెడతారా అన్నట్లు కనిపించింది ప్రోమో. మొన్న రీతూకి కళ్యాణ్‌కి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకునే టాస్క్ కూడా బాగా హిట్ అయింది. సోషల్ మీడియాలో వీరిదే లవ్ ట్రాక్ అంటూ కొందరు పోస్ట్ చేస్తే.. తాజాగా రీతూకిి పవన్‌కి లవ్‌ట్రాక్ పెడతారేమో అని కొందరు అంటున్నారు. మరి ట్రాక్ ఎంత వరకు నడుస్తుందో.. ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.