హైదరాబాద్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌ను నిర్మించనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మించనుంది. దాదాపుగా 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఈ క్యాంపస్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సహకారాన్ని అందించనుంది.
కేటీఆర్ విషయంలో రేవంత్‌కు హైకోర్టు ఝలక్! అందుకు అర్హతే లేదని తేల్చిన ధర్మాసనం
ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గూగుల్ తన మూలాలను మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని తెలిపారు. ఇంతకు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్యక్రమాలకు దారి తీశాయన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు.
మళ్లీ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి ! టీ కాంగ్రెస్ ఏకతాటిపైకి రావడం అసాధ్యమేనా ?
ప్రతిష్టాత్మక కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ తమ డేటాసెంటర్‌ను నిర్మించనున్నట్లుగా ప్రకటించింది. 15 ఏళ్ల కాలంలో ఈ డేటా సెంటర్ అభివృద్ధికి గానూ..రూ.15,000 కోట్ల రూపాయలు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న డేటా సెంటర్ ను మరింత విస్తరించనుంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.