KCR KIT Telangana Gov In: 
మ‌హ‌బూబ్ న‌గ‌ర్: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మంత్రులు, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కలెక్టర్లు, వారి భార్యలు, డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీల కుటుంబాల గర్భిణులు సైతం గవర్నమెంట్ హాస్పిటల్ లో పురుడు పోసుకున్నారు. ఈ క్రమంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గ‌ర్భిణులు మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్ర‌స‌వించారు. వైద్యులు శనివారం ఒక్కరోజు 44 మంది శిశువుల‌కు పురుడు పోశారు. 


నేడు కాన్పు అయిన గర్భిణులంతా ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన వారేనని ప్రభుత్వ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్ కిష‌న్ తెలిపారు. 44 మంది ప్రసవాలలో కొంద‌రు గర్భిణులకు నార్మ‌ల్ డెలివ‌రీ కాగా, కొందరికి సీజేరియ‌న్ చేసి తల్లి, బిడ్డకు ఏ ప్రమాదం లేకుండా డెలివరీ చేసినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం కేటీఆర్ కిట్ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కిట్ ప‌థ‌కం తెచ్చిన తరువాత రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివ‌రీల సంఖ్య భారీగా పెరుగుతోంది. బాలింత‌ల‌ను ఇంటికి త‌ర‌లించేందుకు అమ్మ ఒడి వాహ‌నాల‌ను సైతం వినియోగిస్తున్నారు. ఆరోగ్య ల‌క్ష్మి ప‌థ‌కం కింద గ‌ర్భిణుల‌కు ఐర‌న్, ఫోలిక్ యాసిడ్ వంటి మెడిసిన్స్‌ను అందిస్తున్నారు.


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సైతం డాక్టర్లు, వైద్య సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవాలని, సకాలంలో వారికి వైద్యం అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా గ‌ర్భిణిల‌కు నార్మ‌ల్ డెలివ‌రీలు చేసేందుకు వైద్యులు ప్రాధాన్య‌త ఇవ్వాలని, అత్యవసరమైతే.. తల్లిబిడ్డలకు ఇబ్బంది అనుకుంటే తప్పా సిజేరియన్ చేయకూడదని గతంలో పలుమార్లు సూచించారు.


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సైతం డాక్టర్లు, వైద్య సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవాలని, సకాలంలో వారికి వైద్యం అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా గ‌ర్భిణిల‌కు నార్మ‌ల్ డెలివ‌రీలు చేసేందుకు వైద్యులు ప్రాధాన్య‌త ఇవ్వాలని, అత్యవసరమైతే.. తల్లిబిడ్డలకు ఇబ్బంది అనుకుంటే తప్పా సిజేరియన్ చేయకూడదని గతంలో పలుమార్లు సూచించారు.


గర్భిణుల కోసం కేసీఆర్ కిట్.. 
కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 4 వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. గర్భిణీ స్త్రీల కోసం రాష్ట్ర ప్రభుత్వం KCR కిట్ స్కీమ్ ప్రారంభించింది. గర్భిణీ స్త్రీలు ఈ పథకాన్ని గరిష్టంగా 2 డెలివరీలకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుకు వచ్చి ప్రసవం అయిన మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గర్భిణీలతో పాటు నవజాత శిశువుకు అవసరమైనవి అందించడం. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు రూ. మూడు దశలలో 12,000. ఒక శిశువు అమ్మాయి అయితే అదనపు రూ. 1000 ప్రభుత్వం అందిస్తుంది. కేసీఆర్ కిట్ లో బేబీకి నూనె, తల్లి, బిడ్డకు ఉపయోగపడే సబ్బులు, హ్యాండ్ బ్యాగ్, చిన్నారికి బొమ్మలు, డైపర్స్, బేబీ పౌడర్, షాంపూ, చీరలు, టవల్, నాప్కిన్స్, బేబీ బెడ్ మొత్తం 16 వస్తువులు KCR KITలో ఉంటాయి.