ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 12 మంది అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయడం కోసం 344 మంది తమకు టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ కేటీఆర్ తనపై దాడులు చేశారని అన్నారు. అనిల్ తో కొట్టించారని అన్నారు. ‘‘నా పార్టీలో చేరినవారికి నరకం చూపించారు. గద్దర్ అన్నను కూడా చిత్రహింసలు పెట్టారు. రేవంత్ రెడ్డి కూడా  గద్దర్ అన్న మీద ఒత్తిడి తెచ్చారు పార్టీ లోకి రావాలని. కామారెడ్డిలో నేను పోటీ చేస్తా అని అనౌన్స్ చేయండంతో రైతులను చిత్రహింసలు చేశారు. కేసీఆర్, కాంగ్రెస్, మీద తెగించిన వారు మా పార్టీలో చేరుతున్నారు.


తెలంగాణ ఎన్నికల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.100 కోట్ల నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు కేసీఆర్. రేవంత్ రెడ్డికి షర్మిలా రెడ్డి మద్దతు ఇస్తారని నేను ముందే చెప్పాను. అమెరికా నుండి వందల కొద్ది నాకు కాల్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని. లక్షల కోట్లు ఇస్తామని కొన్ని రాజకీయ పార్టీల వారు ఆఫర్ ఇస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు పెద్ద మనుషులు నాతో మాట్లాడి ఒప్పించాలని వస్తున్నారు.


నా అకౌంట్లు ఓపెన్ చేస్తే 50 లక్షల కోట్లు డొనేట్ చేస్తా. ప్రపంచంలోనే చందా తీసుకోని ఏకైక వ్యక్తిని నేను. ప్రజల అభివృద్ధి కోసం 5 లక్షల కోట్లు పంచాను. 40 లక్షల వితంతువులను ఆదుకున్న ఘనత నాది. కులగజ్జి ఉండవద్దు అని, దళిత అమ్మాయిని పెండ్లి చేసుకున్నా. షర్మిలకు ఓటు బ్యాంక్ ఉందా, కోదండ రామ్ పార్టీకి ఓటర్స్ ఉన్నారా? కోదండరాం లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే దేశం ఏం కావాలి. భారత్ శ్రీలంక కావద్దు అనే ఉదేశ్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. 


కమ్మ రాజ్యంలో కడప రెడ్డి మూవీని ఆపింది నేనే. ఒకప్పుడు నన్ను దేవుడు అన్న వారు ఇప్పుడు దెయ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇవ్వను. ఉచిత విద్య, లక్షల కోట్లు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాను. ఈ హామీలే నన్ను గెలిపిస్తాయి. మోదీ గవర్నమెంట్ ని అదుకున్నది నేను కాదా? 


రాహుల్ గాంధీ నాతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. నాకు 30 సీట్లు వచ్చినా అధికారం నాదే, తెలంగాణలో నేనే సీఎం అవుతా. నా అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తా’’ అని కేఏ పాల్ మాట్లాడారు.


12 మంది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు వీళ్లే
నకిరేకల్‌ - కదిర కిరణ్‌కుమార్‌
మధిర - కొప్పుల శ్రీనివాస్‌ రావు
జుక్కల్‌ (ఎస్సీ) - కర్రోల్ల మోహన్‌
ఉప్పల్‌ - కందూరు అనిల్‌ కుమార్‌
యాకుత్పురా - సిల్లివేరు నరేశ్‌
రామగుండం- బంగారు కనకరాజు
కల్వకుర్తి - కట్టా జంగయ్య
వేములవాడ- అజ్మీరా రమేశ్‌బాబు
నర్సాపురం - సిరిపురం బాబు
చెన్నూరు - మొయ్య రాంబాబు
జహీరాబాద్‌ - బేగరి దశరథ్‌
గజ్వేల్‌ - పాండు