KA Paul Comments: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయం నెరవేరాలంటే విగ్రహాలు కాదు రాజ్యాధికారం కావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటీ పడి మరి 125 అడుగువు అంబేడ్కర్ విగ్రహం పెడుతున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. తాను అడిగే ప్రశ్నలకు జవాలు చెప్పలేకే తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టి.. ఇప్పుడు ఏపీని పొగుడుతారా అని ప్రశ్నించారు. దేశం మరో శ్రీలంకగా మారుతోందని ధ్వజమెత్తారు. 2008లో 10 కోట్లు అడగడానికి కేసీఆర్ తన దగ్గరకు వచ్చారని కేఏ పాల్ అన్నారు. అలాగే ప్రస్తుతం ఆయన తనను చిత్రహింసలు పెట్టాలని చూస్తున్నారని.. ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నాని చెప్పారు.
అక్టోబర్ 1వ తేదీన జరగనున్న గ్లోబల్ పీస్ సభను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని కేఏ పాల్ అన్నారు. అక్టోబర్ వ తేదీన గ్లోబల్ పీస్ సభ, 2వ తేదీన గ్లోబల్ పీస్ ఎకనమిక్ మీటింగ్ జరుగుతుందన్నారు. హైదరాబాద్ కు చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తన ఇన్విటేషన్ ను అంగీకరించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రజలు మేలు జరుగుతుందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
మొన్నటికి మొన్న మీ జీవితాలను నేను మాత్రమే మార్చగలనంటూ వ్యాఖ్య
తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను తాను మాత్రమే మార్చగలనని చెప్పుకొచ్చారు. అలాగే హిట్లర్ చనిపోయిన రోజున సచివాలయం ఎలా ప్రారంభిస్తారని... తెలంగాణ(Telangana) తాజా రాజకీయాలపై స్పందించారు. తనకు ఇష్టం లేకపోవడం వల్లే దేవుడు అక్కడ అగ్ని ప్రమాదం సృష్టించాడని కూడా చెప్పాడు.
"కేసులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని ప్రజాశాంతీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసు అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో పాల్ మాట్లాడారు. తాను ఓడిపోలేదని, పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ట్రంప్ అరెస్ట్ అవుతారని తాను గతంలోనే చెప్పాని గుర్తు చేశారు. తనపై సిరిసిల్లలో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని అన్నారు. అనిల్ కుమార్ తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ను డిమాండ్ చేశారు. హిట్లర్ చనిపోయిన ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో తాను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. లేనిపోని కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తనను చంపేందుకు చాలా కుట్ర జరుగుతోందన్నారు." ఇదంతా రాసి ఉన్న తెలుగు, ఇంగ్లీషు కాపీలను కేఏ పాల్ షేరే చేస్తూ... రీడ్, థింక్ అండ్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.