జూబ్లీహిల్స్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకొని వెళ్లి సీన్ ను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల దాటిన వ్యక్తి సాదుద్దీన్ తో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు రెండ్రోజుల క్రితం తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారితో తాజాగా నేరం జరిగిన తీరుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. నేరం జరిగే సమయంలో నిందితులు తిరిగిన జూబ్లీహిల్స్ లోని ఆమ్నేషియా పబ్, బంజారాహిల్స్ లోని కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, రోడ్డు నంబర్ 44 ప్రాంతాలకు నిందితులను తీసుకొని వెళ్లారు. అక్కడ సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు.


Also Read: అసలు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? పోలీసులు ఇది ఎందుకు చేస్తారు? ఉపయోగం ఏంటి?


ఇవాళే కస్టడీ చివరి రోజు
గ్యాంగ్ రేప్ నిందితుల పోలీసుల కస్టడీ నేటితో ముగియనుంది. తొలుత మైజర్ అయిన సాదుద్దీన్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతను చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను కూడా వేర్వేరుగా ప్రశ్నించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో వారు చెప్పిన వివరాలను బట్టి, మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వారిని విచారణ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ నేడు విచారణ సాగనుంది. నిన్న  నిందితులు అందరికి ఉస్మానియా ఆసుపత్రిలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు.


ఈ రేప్‌ కేసులో బాధితురాలి మెడికల్‌ రిపోర్టు కీలకంగా మారింది. మైనర్‌ బాలిక మెడపై కొరకడం, గీకడంతో ఆ ప్రదేశంలో గాయాలు అయ్యాయి. టాటూలా ఉండాలని మెడపై కొరికినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలిక ప్రతిఘటించడంతో గాయాలు అయినట్లు నిందితులు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో రేప్‌ ఘటన నేరాన్ని నిందితులు ఒకరిపై ఒకరిపైకి తోసుకున్నారు. సాదుద్దిన్‌ తమను రెచ్చగొట్టాడని మిగతా నిందితులు పోలీసుల ముందు చెప్పారని సమాచారం. కానీ, అసభ్యంగా ప్రవర్తించింది ఆ ఐదుగురేనని సాదుద్దీన్ అన్నట్లు సమాచారం.


నిందితులకు బయటి నుంచి భోజనం
మరోవైపు, సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత నిందితులను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు వారికి బయటి నుంచి వచ్చిన భోజనాలను లోనికి పంపినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వచ్చిన భోజనాలను పీఎస్‌లోకి అనుమతించినట్లు సమాచారం. అయితే, కస్టడీలో ఉన్న నిందితులకు పోలీసులే భోజనాలు పెట్టాలనే నిబంధన ఉంది. కానీ, మైనర్ల బంధువులు తీసుకొచ్చిన ఆహారాన్ని లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది.


Also Read: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు, సూసైడ్ నోట్, పెన్ డ్రైవ్ స్వాధీనం