Jogulamba Gadwal murder case update: జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీన్ టూ సీన్ రీకనస్ట్రక్ట్ చేస్తున్న పోలీసులకు కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. మృతుడి భార్య, అత్తతో బ్యాంక్ ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే హత్యవెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బైక్ కు ట్రాకర్ పెట్టిమరీ వెంబడించి చంపినట్లుగా తెలుస్తోంది.

జోగులాంబ గద్వాల జిల్లా రాజావీధికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్‌తో  కర్నూలు జిల్లాకు కల్లూరుకు చెందిన ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమ , ఆ తరువాత పెళ్లికి దారితీసింది. కుటుంబ పెద్దలను పెళ్లికి ఒప్పించిన తేజేశ్వర్, ఈ ఏడాది పిబ్రవరి నెలలో ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ముహూర్తానికి కొద్ది రోజుల ముందు పెళ్లికూతురు ఐశ్వర్య జంప్. ఎక్కడికి వెళ్లిందో తెలియదు, ఎందుకు వెళ్లిందో తెలియదు. కుటుంబ సభ్యులు సైతం సరిగా పట్టించుకోకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నాడు సర్వేయర్ తేజేశ్వర్.

కొద్ది రోజుల తరువాత తేజేశ్వర్‌కు ఐశ్వర్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి చేసేందుకు,పెళ్లి ఖర్చులకు కూడా మావద్ద డబ్బు లేదు. అందుకే ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయానంటూ మాయ మాటలతో తేజేశ్వర్ ను నమ్మించింది. అప్పటికే ప్రేమలో పీకల్లోతు మునిగిన తేజేశ్వర్, ఐశ్వర్య మాటలకు చలించిపోాయాడు. నేనే మన పెళ్లి ఖర్చులు భరిస్తా, పైసా కట్నం వద్దు ,నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఆ అమ్మాయి మనకొద్దంటూ వారించినా వినలేదు. గత నెల మే 18 తేదిన గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లైన కొద్దిరోజులకే అసలు కథ మొదలైంది. పెళ్లికి ముందు ఐశ్వర్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు అదే బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తున్న తల్లి సుజాతతో గత కొంతకాలంగా రిలేషన్  కొనసాగిస్తున్నాడు. ఆ తరువాత సుజాత కూతరు ఐశ్వర్యతో పరిచయం పెంచుకుని కూతురిని కూడా లోబర్చుకున్నాడు. అలా తల్లికూతుళ్లతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. 

వగలాడి మాటలతో సర్వేయర్ ను పెళ్లికి ఒప్పించి గత నెలలో పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, పెళ్లి తరువాత తిరిగి బ్యాంక్ ఉద్యోగితో అక్రమ సంబంధం కొనసాగించింది. పెళ్లైన నెల కేవలం నెలరోజుల్లో మే 13 నుంచి జూన్ 13 వరకూ ఐశ్యర్య కాల్ డేటాలో ఏకంగా 2200  సార్లు బ్యాంక్ ఉద్యోగి తిరుమల్ రావుతో ఫోన్ లో మాట్లడిందంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. అక్రమ సంబంధానికి భర్త తేేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఐశ్వర్య , బ్యాంక్ ఉద్యోగితో కలసి తేజేశ్వర్ హత్యకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. సర్వేయర్ తేజేశ్వర్ ఫిర్యాదుతో కేసునమోదు చేసిన గద్వాల్ పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

తేజేశ్వర్ ను తమ అక్రమ సంబధానికి అడ్డుతొలిగించుకోవాలని భావించిన భార్య ఐశ్వర్య , సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించింది. నాలుగు సార్లు తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేసి విఫలమైన సుపారీ గ్యాంగ్ , ఈసారి తేజేశ్వర్ కదలికలపై నిఘాపెట్టేందుకు తన బైక్ కు ట్రాకర్ పెట్టారు. నిరంతరం తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకుంటూ ఫాలో అయ్యారు. ఈనెల 17వ తేది సర్వే ఉంది రమ్మంటూ కారులో తేజేశ్వర్‌ను నమ్మించి తీసుకెళ్లిన సుఫారీ గ్యాంగ్, గద్వాల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిప్పుతూ , కారులోనే మారణాయుధాలతో అత్యంత కిరాతకంతా చంపినట్లుగా తెలుస్తోంది. శవాన్ని ఈనెల 21 తేదీన గాలేరు నగరి కాల్వగట్టుపై పడేయడంతో స్దానికులు పోలీసులకు సమాచరం ఇచ్చారు. ఇలా తేజేశ్వర్ హత్య వెలుగులోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును త్వరగా తేల్చేందుకు , మరో రెండు పోలీసు బృందాలను కర్నూలుకు పంపినట్లుగా తెలుస్తోంది. మా బిడ్డ ను నమ్మించి , పెళ్లైన నెలరోజుల్లోనే ప్రాణాలు తీసిన ఐశ్వర్యపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవలంటూ డిమాండ్ చేస్తున్నారు సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబ సభ్యులు.