Telangana New Governor: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. తెలంగాణ రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త గవర్నర్‌కు ఫ్లవర్ బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Jishnu Dev Varma: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం
Venkatesh Kandepu | 31 Jul 2024 05:32 PM (IST)
Telangana News: తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే.. కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం