Hyderabad Latest News: హైదరాబాద్ నగరంలో కేబుల్ ఆపరేటర్ల ఎంత పవర్ ఫుల్ అంటే.. వాళ్లు అనుకుంటే ఏకంగా గంటల వ్యవధిలో తమ పంతాన్ని నెగ్గించుకోగలరు. తాజాగా నగరంలో వేగంగా జరిగిన పరిణామాలే అందుకు నిదర్శం అనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుస విద్యత్ షాక్‌లతో నగరంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రామంతపూర్‌లో ఏకంగా ఆరుగురు కృష్ణాస్టమి వేడుకలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఘటనలలో అనేక మంది గాయపడ్డారు. ఇటీవల ఈ రెండు ఘటనలే కాదు గతంలో నగరంలో అనేక ప్రాంతాల్లో హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓకేసారి ఆరుగురు చనిపోవడం పెను సంచలనంగా మారింది. ఈ విషాదాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడం, రంగంలోకి దిగిన విద్యుత్ షాక్ అధికారులు, కారణం కేబుల్ వైర్లే నంటూ ఆరోపిస్తూ .. పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం చకచకా జరిగిపోయాాయి.
ఎప్పుడైతే కేబుల్ వైర్ కట్ అయ్యిందో అత్యంత వేగంగా పరిణామాలు మారిపోయాయి. కేబుల్ ఆపరేటర్లు యూనిన్ రంగంలోకి దిగి, కేబుల్ వైర్లు కట్ చేయడం ఆపకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలు బంద్ చేస్తామంటూ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలు సైతం గంటల తరబడి నిలిచిపోయాయి. ఇంటర్ నెట్‌పై ఆధారపడ్డ లక్షల మంది వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సైతం దిగిరాక తప్పలేదు. ఆపరేటర్లతో చర్చలు జరిపి, కేబుల్ వైర్లు కట్ చేకుండా ఆపడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే.. ప్రభుత్వం ఆదేశించినట్లు, కేబుల్ ఆపరేటర్లు చెప్పినట్లు నగరవ్యాప్తంగా కేబుల్ వైర్లు క్రమబద్దీకరించడం సాధ్యమేనా.. అలా సాధ్యమైన పనైతే ఇన్నాళ్లు ఎందుకు లైట్ తీసుకున్నారు. సాధ్యం కాని పని అయితే ఇప్పుడెందుకు డైవర్షన్ టెక్నిక్‌ప్లే చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కోటిన్నర మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. లక్షన్నర మంది కేబుల్ ఆపరేటర్లు ఇంటర్ నెట్ సరఫరా చేసే వివిధ కంపెనీలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే నగరవ్యాప్తంగా కేబుల్ వైర్లు దాదాపు తొంభై శాతంపైగా విద్యుత్ స్తంభాలపై ఆదారపడే ఇంటర్ నెట్ సేవలు అందిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. విద్యుత్ శాఖ సీఎండీ నుంచి క్రింది స్థాయి అధికారులు వరకూ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ చూసీచూడనట్లుగా విద్యుత్ శాఖాధికారులు వ్యవహరిస్తూనే వచ్చారు. అవకాశం ఇచ్చారు కాదా, మనమెందుకు ఆగాలి అన్నట్లుగా కేబుల్ ఆపరేటర్లు సైతం ప్రత్యామ్నాయ వ్యవస్ద ఏర్పాటు చేసుకోకుండా, విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు సమాంతరంగా ఇంటర్ నెట్ కేబుల్ వైర్లు లక్షల మీటర్ల మేరా ఏర్పాటు చేశారు. ఇవన్నీ తొలగించి, సింగిల్ ఫైబర్ లైన్ వేస్తామంటూ తాజాగా ఆపరేటర్లు చెబుతున్నప్పటికీ ఆచరణ సాధ్యం కానిదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యుత్ షాక్‌లకు కారణం కేబుల్ వైర్లు మాత్రమే కాదనే విషయం విద్యుత్ శాఖ అధికారులకు తెలుసు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపాాలు ఉన్నాయనే వాస్తవాలు వారికి తెలుసు. కానీ తాత్కాలికంగా ఆపరేటర్లపై నెపం వేయడంతో విద్యుత్ షాక్ విషయం ప్రక్కదారి పట్టింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేటర్లు సైతం తామేం తక్కువ తినలేదన్నట్లు గంటల వ్యవధిలో ప్రభుత్వాన్ని దారిలోకి తెెచ్చిమరీ, పంతం నెగ్గించుకున్నారు. కానీ మీడియా ముందు హమీ ఇచ్చినట్లుగా నగర వ్యాపంగా విద్యుత్ స్తంభాలపై ఆధారపడకుండా సింగల్ ఫైబర్ వ్యవస్ద ఏర్పాటు చేయడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కమిట్‌మెంట్ ఇచ్చినట్లుగా కేబుల్ వ్యవస్ద మారితే సంతోషించదగ్గ పరిణామమే కానీ, తప్పు మాది కాదంటే మాది కాదన్నట్లుగా తప్పించుకునేందుకు అటు విద్యుత్ శాఖ, ఇటు కేబుల్ ఆపరేటర్లు చేతులు దులుపుకున్నాం కాదా అని సరిపెట్టుకుంటే మళ్ళీ వరుస షాక్‌లతో అమాయకులు ప్రాణాలు కోల్పోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.