Rainfall situation in Hyderabad in the next 24 hours: హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నిరంతర మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయని, ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో గత కొన్ని గంటలుగా నిరంతర మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. IMD హైదరాబాద్ బులెటిన్ ప్రకారం, నగరంలో రాబోయే 24 గంటల్లో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, 30-40 కి.మీ./గం వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. నగరంలో 20-50 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్ష తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ బీభత్సమైన వర్షపాతం హైదరాబాద్ పరిధిలో నమోదు కాలేదు.
హైదరాబాద్ లో వర్షం కారణంగా వినాయక చతుర్థి సందడి పెద్దగా కనిపించడం లేదు. వీది విధినా మండపాలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే ఆ మండపాల దగ్గర విపరీతమైన సందడి ఉండాలి. కానీ వర్షాల కారణంగా మాములుగా పూజలు మాత్రమే నిర్వహిస్తున్నారు.
అల్పపీడనం ఈ వాతావరణ వ్యవస్థ రాష్ట్రంలో స్తబ్దుగా ఉండి, అసాధారణ వర్షపాతాన్ని కలిగిస్తోంది. అర్బన్ ప్లానింగ్ నిపుణులు, స్టార్మ్‌వాటర్ డ్రైనేజీ వ్యవస్థలు సరిపోకపోవడం, అతిగా కాంక్రీటీకరణ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం కష్టమవుతోందని అందుకే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
ముంపు అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్న వరద నీటిలో ప్రయాణించవద్దు, విద్యుత్ స్తంభాల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీగా వర్షాలు పడకపోవడంతో.. అధికారులు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఇవ్వడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వరద బీభత్సం ఎక్కువగా ఉన్న చోట్ల.. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు .