Flights Emergency Landing: దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు భయాందోళనలకు గురి అవుతున్నారు. మొన్న జరిగిన ప్రమాదం నుంచి విమానం ఎక్కాలంటే వణికిపోతున్నారు. దీనికి తోడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. వీటన్నంటికీ మించి సాంకేతిక సమస్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఫ్లైట్ బయల్దేరిన కాసేపటికే విమానాలు తిరిగి వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు అంటూ అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి. ఇవాళ రెండు విమానాశ్రాయాల్లో ఇలాంటి ఘటలు జరిగాయి.
హైదరాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌లో సాంకేతికలోపపం తలెత్తింది. దీంతో విమానాశ్రయం నుంచి బయల్దేరిన పది నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండ్‌కు రిక్వస్ట్ వచ్చింది. ఈ సమయంలో 80 ప్రయాణికులు అందులో ట్రావెల్ చేస్తున్నారు. వీరితోపాటు సిబ్బంది కూడా ఉన్నారు. విమానం తిరిగి రావడంతో తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు.
ఢిల్లీలో విమానం అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న ఇండిగో విమానం (6E 2006) సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయింది. లేహ్ బయల్దేరిన కొద్దిసేపటికే విమానం వెనక్కి తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిందని వార్తా సంస్థ IANS నివేదించింది. ఈ టైంలో సిబ్బందితో సహా దాదాపు 180 మంది విమానంలో ఉన్నారు. ఆ విమానం ఎయిర్ బస్ A320-251N. ఆ విమానం చకులా నుంచి తిరిగి వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జూన్ 17, మంగళవారం నాడు కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ఉదయం 9:31 గంటలకు కొచ్చి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్‌లైన్ అధికారిక IDకి ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. ఈ విమానం మొదట మస్కట్ నుంచి కొచ్చికి చేరుకుంది. ఆ టైంలో విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఈ బెదిరింపు తర్వాత, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) పరిస్థితిని అంచనా వేయడానికి బాంబు థ్రెట్ అంచనా కమిటీ (BTAC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు.
పూర్తి తనిఖీలు తర్వాత ఎగిరేందుకు అనుమతి
నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత పూర్తయిన తర్వాత మాత్రమే ఢిల్లీకి పంపించారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లుఫ్తాన్సా విమానం LH752 కు ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. ఆ విమానం మార్గమధ్యలో జర్మనీకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. దీనితో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం BTAC సమావేశం జరిగింది. వరుసగా బెదిరింపులు రావడంతో విమాన భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి, విమానాశ్రయాలలో నిఘా పెరిగింది.