హైదరాబాద్ క్రికెడ్ అభిమానులకు పూనకాల లోడింగ్.. ఉప్పల్ స్డేడియం వేల మంది క్రికెట్ అభిమానుల సందడితో దద్దరిల్లనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన మూడునెల వ్యవధిలోనే ఉప్పల్ లో టీమ్ ఇండియా న్యూజిల్యాండ్ వన్ డే మ్యాచ్ అలరించనుంది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే తొలి వన్డే కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్డేడియంలో మ్యాచ్‌కు ఎటవంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్ సిఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 


ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయంలో విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నేటి మ్యాచ్ టిక్కెట్ల విక్రయంలో ఆచితూచి వ్యవహరించింది. ఓపెన్ కౌంటర్లు ఏర్పాటు చేసి టెక్కెట్లు అమ్మకుండా నేరుగా ఆన్ లైన్ లోనే నేటి మ్యాచ్ టిక్కెట్లు విక్రయించడం ద్వారా తొక్కిసలాట,గొడవలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయగలిగారు. 


ఉప్పల్‌ స్టేడియం మొత్తం సిట్టింగ్ కెపాసిటీ 39,112 మంది  కాగా, అందులో 9695 కాంప్లిమెంటరీ పాసెస్ లు ఇవ్వగా, మిగతా 29,417 టికెట్స్ ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా విమర్మల దాటి నుంచి గట్టెక్కింది హెచ్ సిఎ. ఆన్‌ లైన్ లో మ్యాచ్ టిక్కెట్స్ కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు ఆ తరువాత టిక్కెట్ కోడ్ ఆధారంగా నేరుగా ఎల్బీ స్టేడియం, లేదా గచ్చిబౌలి స్డేయంకు వెళ్లి ఆన్ లైన్ టిక్కెట్ కొన్న బార్ కోడ్ ,వ్యక్తిగత గుర్తింపు కార్డులు చూపించి అక్కడ టిక్కెట్స్ తీసుకున్నారు. ఇలా గంటల తరబడి క్యూలైన్ లలో వేచి ఉండి ,విసిగిపోయే అవకాశం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు.దీంతో ఆన్ లైన్ లో టిక్కెట్స్ కొన్న అభిమానులు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్‌ టికెట్లు తీసుకొన్నారు. ఓరోజు ముందుగానే ఉప్పల్ చేరుకున్న ఇండియా,న్యూజిల్యాండ్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు పూర్తి చేశాయి. 


ఈరోజు మధ్యాహ్నం ౧.౩౦గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉప్పల్ స్టేడియం లోనికి గంట ముందుగానే టిక్కెట్లు కొన్న అభిమానుల అనుమతించనున్నారు. గేట్ నెంబర్ వన్ ద్వారా ఇండియా,కివీస్‌ జట్లు స్టేడియం లోపలికి చేరుకున్నాయి. మిగతా గేట్ల ద్వారా టిక్కట్ పై ముద్రించిన గేటు నెంబర్, సీటు నెంబర్ ఆధారంగా స్డేయం లోపలికి వేలాదిగా అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు చేరుకుంటారు. ఈనెల 21న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, 24న ఇండోర్‌లో మూడో వన్డే జరనుంది. జనవరి 27న రాంచీలో తొలి టీ20, 29న లక్నోలో రెండో టీ20, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.  


ఈరోజు జరిగే మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రాతా ఏర్పాట్లు చేసారు. ఉప్పల్ స్టేడియం ప్రధాన రహదారి నుంచి స్టేడియం వైపు వెళ్లే మార్గంలోకి  రావాంటే కచ్చితంగా టిక్కెట్ ఉండాల్సిందే. ఇక్కడ టిక్కెట్ చూపి భారీకేడ్స్ దాటితే తప్ప లోపల ప్రధాన ద్వారం వద్దకు వెళ్లలేరు. టిక్కెట్ లపై ఉన్న గేట్ నెంబర్ ఆధారంగా అక్కడ మరోసారి తనిఖీ చేసి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. ఇలా రెండచెల భద్రత నడుమ ఉప్పల్ మ్యాచ్ జరగనుంది. వేలాదిగా వాహనాలు ఉప్పల్ స్డేడియం వైపు రానున్నాయి. అందుకే ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు స్డేడియం సమీపంలో రోడ్లకు ఇరువైపులా టూవీలర్ పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.