Shamshabad Airport | హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుండి శంషాబాద్‌కు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీలు నిర్వహించగా, 11 బంగారు కడ్డీలను గుర్తించారు. నిందితుడు ఈ బంగారాన్ని తెలివిగా ఐరన్ బాక్స్‌లో అమర్చి తీసుకొస్తున్నాడు. వెంటనే అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడితో పాటు మరో వ్యక్దిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

Continues below advertisement

రూ.1.55 కోట్ల విలువైన బంగారం సీజ్

స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు 1196.20 గ్రాములుగా ఉంది. దీని విలువ దాదాపు రూ. 1.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల గుండా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్, షార్జా వంటి గల్ఫ్ దేశాల నుండి వచ్చే విమానాల్లో ఈ తరహా స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల గురించి సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Continues below advertisement