Sangareddy MLA: తెలంగాణ కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే, (Sangareddy MLA) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) తీరు కొద్ది రోజులుగా మరింత హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పార్టీలో పొసగలేకపోతున్న ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వీహెచ్ లాంటి సీనియర్ నేతలు సముదాయించడంతో మళ్లీ వెంటనే మనసు మార్చుకొని కొన్నాళ్లు పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ముందు రోజు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) భేటీని బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారని బయట విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు.


జగ్గారెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. బుధవారం (మార్చి 9) నాటి అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన భారీ ఉద్యోగ ప్రకటనను జగ్గారెడ్డి స్వాగతించారు. అంతటితో ఆగకుండా కేసీఆర్‌ను కలుస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. రేపే సీఎం అపాయింట్ మెంట్ కోరతానని, ఆయన అంగీకరిస్తే వెళ్లి కలుస్తానని కామెంట్లు చేశారు.


Also Read: KCR JOBS : కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ! కానీ "అలా" జరిగితే మొత్తం రివర్సే !


అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక శాసన సభ్యుడిగా సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాను. నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. నిరుద్యోగుల తరఫున యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు నిర్వహించాం. తెలంగాణలో నేడు కాంగ్రెస్ పట్ల జనాల్లో ఈ ఆదరణ ఉందంటే అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కృషి ఫలితమే. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ ను పున:ప్రారంభించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. దీనికి సంబంధించి రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడుగుతాను’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.


Also Read: KCR: సినిమాల్లో తెలంగాణ యాస ఉంటేనే హీరో క్లిక్ అవుతున్నడు, అప్పట్లో అడిగే దిక్కులేదు - కేసీఆర్


Also Read: Age Relaxation: ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి భారీగా పెంపు, SC, STలకు మరింతగా - KCR వరాల జల్లు