Jobs Notification in Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో (Jobs In Telangana) భాగంగా అర్హత వయసును (Age Relaxation) ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బుధవారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా మిగిలిన ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. దీని వల్ల ఓసీలకు 44 ఏళ్లు, SC, ST, BCలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ఠ పరిమితపెరుగుతుందని KCR చెప్పారు.
ఈ పోస్టుల భర్తీ (Government Jobs in Telangana) ప్రక్రియ కోసం ఏటా సుమారు 7 వేల కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని చెప్పారు. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. యువతకు ఒక స్పష్టత ఉండేలా ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calender) రూపొందిస్తామని చెప్పారు. ప్రతి విభాగంలో ఏర్పడే ఖాళీలను ఆయా శాఖలు సమర్పిస్తాయని అన్నారు. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు ఇస్తాయని అన్నారు.
‘‘గ్రూపు 1 - 503, గ్రూపు 2 - 582, గ్రూపు 3 - 1370, గ్రూపు 4 - 9,168 పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జోనల్ పోస్టులు 18,866 ఉద్యోగాలు, మల్టీ జోనల్ పోస్టులు 13,170 పోస్టులు, విశ్వవిద్యాలయాలు, సెక్రెటేరియల్, హెచ్ఓడీ వంటి వాటిలో 8147 ఉద్యోగాలు రానున్నాయి.’’ అని కేసీఆర్ వివరించారు.
జిల్లా వారీగా ఉద్యోగాల సంఖ్య ఇదీ
* హైదరాబాద్ - 5,268
* నిజామాబాద్ - 1976
* మేడ్చల్ మల్కాజ్ గిరి - 1769
* రంగారెడ్డి - 1561
* కరీంనగర్ - 1,465
* నల్గొండ - 1,398
* కామారెడ్డి - 1,398
* ఖమ్మం - 1,340
* భద్రాద్రి - కొత్తగూడెం 1,316
* నాగర్ కర్నూల్ - 1,257
* జోనల్ స్థాయిలో - 18,866
* మల్టీ జోన్ - 13,170
* అదర్ కేటగిరి, వర్సిటీలు - 8,174
* మొత్తం పోస్టులు - 80,039 భర్తీ
గతంలో తెలంగాణపై అంతులేని వివక్ష: KCR
అంతులేని వివక్షతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని అన్నారు. తెలంగాణ రైతులను కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆకలి చావులు, నిరుద్యోగులు, రైతుల మరణాలు చూశామని వెల్లడించారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలనే ఉద్దేశంతో తాను ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. విద్యార్థులు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు.