Congress Jaggareddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటనపై వెనక్కి తగ్గారు. భవిష్యత్ లో సంచలన ప్రకటన ఉంటుందని తేల్చేశారు. బీజేపీ సమావేశాలు, ప్రధాని మోదీపై సభపై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రధానికి గెస్ట్ హౌజ్ అయిపోయిందన్నారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తారేమో అని తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని కానీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. ఉద్యోగాలు గురించి మాట్లాడలేదు, అగ్నిపథ్ రద్దుపై స్పష్టతలేదని ఆరోపించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెళ్లి చూపులు లాగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రధాని తెలంగాణకు ఏం ప్రకటించకుండానే వెళ్లిపోయారని విమర్శంచారు. బీజేపీ వాగ్దానాలు ఒక్కటి కూడా తీర్మానం చేయలేదన్నారు. కార్యవర్గ సమావేశాలు తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
లోడు లక్ష
తెలంగాణ రాకముందు ఇసుక తక్కువ ధరకు దొరికేదని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేసి కరీంనగర్ కు మాత్రమే పరిమితం చేశారన్నారు. ఇసుక దందా వల్ల కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక లోడు లక్ష అవుతుందన్నారు. బ్లాక్ మనీ, ఫార్మా కన్నా ఇసుక దందాలో ఎక్కువ కొట్టేస్తున్నారని ఆరోపించారు.
ఇసుక దందాను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
సంచలన వ్యాఖ్యలకు టైం ఉంది
రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు జగ్గారెడ్డి ఏం మాట్లాడిన నెగిటివ్ తీసుకోవద్దన్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి కోసం విజయం కోసమే మాట్లాడతా అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించే మాట్లాడతానన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయక్వత్వంలో కాంగ్రెస్ పార్టీ లయాల్టి గానే పని చేస్తానన్నారు. తాను చేస్తా అన్న సంచలన వ్యాఖ్యలకు ఇంకా టైం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగ్గారెడ్డి ఒక్కడే రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పారన్నారు.
ప్రధాని సభ ఫెయిల్