Hyderabad Traffic Restrictions: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కారణంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా నెక్లెస్ రోటరీ, ఐమాక్స్ థియేటర్ పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 










ఏయే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అంటే..?



  • పీవీ విగ్రహం - నెక్లెస్ రోటరీ, ఎన్టీఆఱ్, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్ ను అనుమతించరు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ వివి విగ్రహం నుంచి షాదాన్, నిరంకారి వైపు వెళ్లాలి

  • అలాగే ట్యాంక్ బండ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గం వైపు ట్రాఫిక్ అనుమతించరు. సోనాబి మసీదు వద్ద రాణిగంజ్ కర్బాలా వైపు మళ్లిస్తారు. 

  • రసూల్ పుర/మినిస్టర్ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే అనుమతి లేదు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు వెళ్లాలి. 

  • ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే అవకాశం ఉండదు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. 

  • ట్యాంక్ బండ్, తెలుగుతల్లి నుంచి, అలాగే బీఆర్కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు పంపిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు నో ఎంట్రీ.

  • ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వైపు కాకుండా రాజ్ దూత్ లేన్ వైపు వెళ్లాలి. 

  • ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్‌ మూసి ఉంటాయి.  


పూర్తిగా మూసి ఉంచబోతున్న రోడ్లు..!


నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్కు, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను శుక్రవారం మూసి వేస్తున్నట్లు వెల్లడించింది.