Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ చింతల్ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్ పోలీసులు ఓ సూచన చేశారు. చింతల్ మార్కెట్ వద్ద ట్విన్సు బాక్స్ కల్వర్టుపై జీహెచ్ఎంసీ పనుల కోసం నెల రోజుల పాటు ట్రాపిక్ ఆంక్షలు విధించారు. పత్రికా ప్రకటన ప్రకారం... జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ నేటి నుంచి నెల రోజుల పాటు పనులు చేపట్టనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆ ప్రాంతంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. రద్దీని నివారించడానికి తిగిన ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. చింతల్ మెయిన్ రోడ్డు నుంచి పద్మానగర్ రింగ్ రోడ్డు వైపు ట్రాఫిక్ ఎల్లమ్మ దేవాలయం-ఎడమ వైపు-వాణి నగర్-కుత్బుల్లాపూర్ గ్రామం వద్ద మళ్లించబడుతుంది. పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి ట్రాఫిక్ ను మాణిక్య నగర్ కమాన్-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ - పాండు విగ్రహం - చింతల్ ప్రధాన రహదారిపై మళ్లిస్తారు. పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ఫైన్ చికెన్ మార్కెట్ - అంబేడ్కర్ నగర్ రోడ్డు - అంబేడ్కర్ విగ్రహం - కుడివైపు - రాంరెడ్డి నగర్ - రెయిన్ బో హైస్కూల్ ఐడీపీఎల్ మెయిన్ రోడ్డు వద్ద మళ్లించబడుతుంది. పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయాణికులు, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఏప్రిల్ 2 నుంచి మే 18 వరకు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు
నేటి నుండి మే 18 వరకు మొత్తం 215 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్ కోసం ప్రధాన మార్గాలు, స్టేడియంకు వెళ్లే మార్గాలతోపాటు స్డేడియం చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసే 8 సెక్టార్లలో పోలీసులు మోహరించారు. మ్యాచ్ కు వచ్చే క్రికెట్ అభిమానులు ఏక్ మినార్ మస్జిద్ రోడ్, స్టేడియం రోడ్ , హిందూ ఆఫీస్ రోడ్ నుండి స్టేడియంకు యాక్సెస్ రోడ్లలోకి చేరుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, వేదిక మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా వాహన దారులకు కోసం 324 అనేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లోకి ఎవరు ముందుగా వస్తే వారి వాహనాలు అదే క్రమ పద్దతిలో పార్క్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసారు.పార్కింగ్‌ను పార్కింగ్ రద్దీ నివారించడానికి, వేదికకు త్వరగా యాక్సెస్ చేయడానికి మెట్రో రైలు సేవలను కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ,అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సమాచారం అందించేందు ఎఫ్ ఎమ్ సేవలను సైతం వినియోగించుకుంటున్నారు.
90 రోజుల పాటు ఎర్రగడ్డలో రోడ్డు మూసివేత
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 28వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్ అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.