Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఖైరతాబాద్, బషీర్ బాగ్, రీవంద్రభారతి, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, నాపంల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలు చేరుకోవాలని సూచించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. 






ఫిబ్రవరి మూడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు


తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆరున బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా నిరాశే ఎదురైందని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బడ్జెట్‌ మావేశాల్లో దీనిపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. కేంద్రం తీరు వల్ల తెలంగాణ భారీ నష్టపోయిందని ఈ విషయాన్ని ప్రకటించడానికి.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ మళ్లీ ఆగిపోయారు. ఇప్పుడు నేరుగా బడ్జెట్ సమావేశాలు పెడుతున్నారు. 


రూ. 3 లక్షల కోట్ల వరకూ తెలంగాణ బడ్జెట్ ఉండే  అవకాశం 


రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధాన్యత దక్కనుందని తెలుస్తోంది. దళిత బంధు వంటి పథకాలకు భారీగా నిధులను కేటాయించేలా కార్యాచరణ చేస్తు న్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే కొత్త పథకాలు, వ్యవసాయ ప్రాధాన్యత, సంక్షేమ రంగాలకు కీలక స్థానం దక్కనుంది. కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చేలా ఇరిగేషన్‌ శాఖ కీలక కసరత్తు చేస్తోంది., సీతారామా, డిండి, పాలమూరు ఎత్తి పోతల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు నిధులు కోరనున్నట్లు స మాచారం. 


ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్


కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సబ్ కా సాత్ సబ్ కా వికాన్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను ఎందుకు రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 


తెలంగాణకు ఒక్క మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు


119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు కవిత. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణలోని నిమ్స్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని జాతీయ మీడియా ఏఎన్ఐ తో మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కేవలం కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తుంది. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు.