Hyderabad Fire Accident: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన

Hyderabad Fire Accident: హైదరాబాద్ చిక్కడపల్లి వీఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. 

Continues below advertisement

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిక్కడపల్లి వి.ఎస్.టి సమీపంలోనీ ఓ గోదాంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దట్టమైన పొగలతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాంలో ప్రమాదం సంభవించడంతో దాదాపు అన్ని కాలిపోయినట్లు తెలుస్తోంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్ని మాపక యంత్రాలతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు సాయం చేయడంతో పాటు ప్రమాదం ఎలా జరిగింది, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం ఎంత మేర ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Continues below advertisement

పది రోజుల క్రితమే నల్లగుట్టలో ప్రమాదం - ముగ్గురు మృతి

సికింద్రాబాద్ నల్లగుట్ట దక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా... కనిపించకుండా పోయిన యువకులు ఆచూకీ మాత్రం లభించలేదు. అందుకే పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అగ్ని మాపక శాఖ, డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లో తిరుగుతూ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం నిపుణులు ప్రత్యేక లైట్లు ఉపయోగించి భవనంలోని అన్ని అంతస్తుల్లో అణువణువూ గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా.. గల్లంతైన గుజరాత్ కు చెందిన వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం అవశేషాలు మాత్రమే లభించాయి. 

భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు 

అయితే ఈ అవశేషాలు ఎవరివనే విషయం ఇంకా తేలలేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పు కూలిపోయి కిందపడడంతో శిథిలాలతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు అన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకొని ఉండడంతో వాటిని తొలగిస్తే పైకప్పుల పరిస్థితి ఏంటని అధికారులు ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే మరోవైపు కనిపించకుండా పోయిన యువకుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు కోరుతున్నారు. అవి అప్పగించే వరకు భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భవనం పరిసరాలకు ఎవరూ రావొద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అందించారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రత్యేక సాంకేతిక ఉపయోగించి చుట్టు పక్కల ఇళ్లకు ఇబ్బంది కల్గకుండా కూల్చి వేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. 

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని అన్నారు. గురువారం ఉదయం 11.20 గంటలకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు.

Continues below advertisement