Outer Ring Rail Project Latest News | హైదరాబాద్: దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైలు (Outer Ring Rail) ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారైంది. మొత్తం 392 కిలోమీటర్ల పొడవుతో ఈ రైలు మార్గం రానుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 26 కొత్త స్టేషనులు ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తెలంగాణలోని 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేయాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పరిధిలో ఈ ప్రాజెక్టు వస్తుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సంబంధిత అగ్ర ప్రాజెక్టు నివేదిక (Outer Ring Rail DPR) రైల్వే బోర్డు కు దక్షిణ మధ్య రైల్వే పంపించాలని భావిస్తోంది.
మూడో ప్రతిపాదనకు అంగీకారం..
గతంలో రైల్వే శాఖ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు మొత్తం దూరం 508 కిలోమీటర్లు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు 508.45 కిలోమీటర్ల, 511.51 కిలోమీటర్లు, 392.02 కిలోమీటర్లుగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి రెండు ప్రతిపాదనలు రీజినల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, మూడో ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సారీ సూచనతో దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేసి అలైన్మెంట్ ఖరారు చేసింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే 120 కిలోమీటర్ల దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశం ఉన్న ప్రాంతంలో ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు రాబోతుంది.
6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలుఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో ఆరు చోట్ల ‘రైల్ ఓవర్ రైల్’(ఆర్వోఆర్) వంతెనలు వస్తాయి. కొత్త లైన్‌ను చాలా ఎత్తుగా ఫ్లైఓవర్‌లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ లను ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. హైదరాబాద్ చుట్టూ 361 కి.మీ. మేర రీజనల్ రింగ్ రోడ్ వస్తుండగా, దానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండేలా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఆర్ఆర్ఆర్‌కు ఒకట్రెండు చోట్ల పది కిలోమీటర్ల దూరం ఉండనుంది.
రైల్వే లైన్ ఏ స్టేషన్ల మధ్యలో ఆర్వోఆర్ సికింద్రాబాద్-కాజీపేట - వంగపల్లి- ఆలేరుసికింద్రాబాద్-వాడి - గుళ్లగూడ- చిట్టిగడ్డసికింద్రాబాద్-డోన్ - బూర్గుల- బాలానగర్సికింద్రాబాద్-ముర్ఖడ్ - మాసాయిపేట- శ్రీనివాసనగర్సికింద్రాబాద్-గుంటూరు - వలిగొండ- రామన్నపేటసికింద్రాబాద్-కొత్తపల్లి - గజ్వేల్- కొడకండ్ల
ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఎన్నో లాభాలుఓవైపు రీజనల్ రింగ్ రోడ్డుతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఆర్ఆర్ఆర్ ను కవర్ చేసేలా వస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆ ప్రాజెక్టుతో రోడ్డు, రైలు మార్గంతో కనెక్టివిటీ పెరిగి రవాణా ఆధారిత అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. రింగ్ రైలు ప్రాజెక్టుతో కొత్త రైల్వే రైల్వేస్టేషన్ల నుంచి హైదరాబాద్ కు బస్సులు, మెట్రో రైలు సేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ వస్తుంది. ఈ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రైవేట్ వాహనాలకు బదులు దీన్ని ఎంచుకుంటారు. దాంతో కాలుష్యం సైతం తగ్గుతుందని భావిస్తున్నారు. కనెక్టివిటీ లేని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రైలు పరుగులు, కొత్త రైల్వే స్టేషన్లతో ఆ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.