హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం భావించింది. విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు ఫేజ్‌లలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ పనులకు శ్రీకారుం చుడుతున్నారు. మూడవ దశ కారిడార్‌ కోసం డీపీఆర్‌ల తయారీకి టెండర్లు ఖరారు చేశారు. టెండర్లలో ఐదు కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించగా... అందులో రెండు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. 


ఆర్‌వీ అసోసియేట్స్‌, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్‌ సంస్థలు సాంకేతిక అర్హతను సాధించగా... వాటి ఆర్థిక బిడ్‌లను ఆగస్టు 30న మెట్రో రైలు భవన్‌లో తెరిచారు. అయితే,  వీటన్నింటిలో ఆర్వీ అసోసియేట్స్‌ సాంకేతికంగా అత్యంత అధిక మార్కులు పొందింది. మొత్తం 4 ప్యాకేజీల్లోనూ అతి తక్కువ ఆర్థిక బిడ్‌లను సమర్పించిందని హైదరాబాద్‌  ఎయిర్‌పోర్టు మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. టెండర్‌ నిబంధనల ప్రకారం ఆర్వీ అసోసియేట్స్‌కి రెండు ప్యాకేజీలను ఇచ్చామని, మిగిలిన రెండు ప్యాకేజీలను  సాంకేతిక పరంగా రెండవ స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు ఇచ్చినట్టు ప్రకటించారు. మిగిలిన రెండు ప్యాకేజీలను రెండవ స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు ఇచ్చినట్లు తెలిపారు. 


రెండు నెలల్లో... ఈ రెండు కంపెనీలు ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. ట్రాఫిక్‌ సర్వేలు, రవాణా రద్దీ అంచనాలు, ట్రాఫిక్‌ అంచనాలు, పలు రకాల  రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటి అధ్యయనాలు పూర్తి చేసి పీపీఆర్‌ సమర్పించాలన్నారు. రెండు నెలల్లో ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టు తయారవుతుంది. ఆ తర్వాత మూడు  నెలల్లో మెట్రో అలైన్‌మెంట్‌, స్టేషన్లు వంటి అంశాలపైనా అధ్యయనం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం.. కన్సల్టెన్సీ సంస్థలు వివిధ కారిడార్‌లలో త్వరగా సర్వే  పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.


సిస్ట్రా ఏజెన్సీ.. ప్యాకేజీ-1, ప్యాకేజీ-4ను దక్కించుకోగా.... ఆర్వీ అసోసియేట్స్‌ ప్యాకేజీ 2, ప్యాకేజీ-3ని దక్కించుకున్నాయి. ప్యాకేజీ-1 అంటే.. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఇస్నాపూర్‌  వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట్‌ వరకు 13 కిలోమాటర్లు, ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు నుంచి ఓఆదర్‌ఆర్‌ నార్సింగి వరకు 22 కిలోమీటర్లు... మొత్తం కలిసి  48 కిలోమీటర్లు ఉంటుంది. ఇందు కోసం రూ.255 కోట్లకు బిడ్‌ వేసింది. ఇక, సిస్ట్రా దక్కించుకున్న ప్యాకేజీ-4.. జేబీఆఎస్‌ నుంచి తూంకుట వరకు 17 కిలోమీటర్ల మేర డబుల్‌  ఎలివేటెడ్‌ మెట్రో, ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్ల మేర డబుల్‌ ఎలివేటెడ్‌ మెట్రో, ఓఆర్‌ఆర్‌ మేడ్చల్ నుంచి  ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు వరకు 29 కిలోమీటర్ల  మెట్రో లేన్‌.. ప్యాకేజీ-4లో మొత్తం మొత్తం కలిసి 58 కిలోమీటర్ల మెట్రో మార్గానికి డీపీఆర్‌ను సిస్ట్రా దక్కించుకుంది. దీని కోసం రూ.2.56 కోట్లకు బిడ్‌ వేసింది.


ఆర్వీ అసోసియేట్స్‌ ఆర్వీ అసోసియేట్స్‌ ప్యాకేజీ 2, ప్యాకేజీ-3ని దక్కించుకున్నాయి. ప్యాకేజీ-2లో శంషాబాద్‌ కూడలి నుంచి షాద్‌నగర్‌ 28 కిలోమీటర్లు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు  నుంచి కందుకూరు ఫార్మాసిటీ వరకు 26 కిలోమీటర్లు, ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్ల వరకు మొత్తం 94 కిలోమీటర్ల డీపీఆర్‌ను  ఆర్వీ అసోసియేట్స్‌ దక్కించుకుంది. ఇందు కోసం రూ.3.05 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. ఇక, ప్యాకేజీ-3: ఉప్పల్‌ కూడలి నుంచి బీబీనగర్‌ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక  చౌరస్తా నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా వరకు 8 కిలోమీటర్లు, ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట నుంచి ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌ వరకు 45 కిలోమీటర్లు. మొత్తంగా 78 కిలోమీటర్ల దూరానికి  రూ.2.53 కోట్లతో బిడ్‌ వేసింది ఆర్వీ అసోసియేట్స్‌.