తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.


➥ సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్ఏ-1) పరీక్షలకు సంబంధించి ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.


➥ అదేవిధంగా 6, 7వ తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఎనిమిదో తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


➥ ఇక 9, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా విధ్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.


ఏడు పేపర్లతోనే పరీక్షలు..
ఈ ఏడాది 8, 9, 10 తరగతి విద్యార్థులకు మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలను రెండు పేపర్లుగా విభజించి ఒకేరోజు ఆ రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ రాధా రెడ్డి తెలిపారు.


ALSO READ:


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌‌లో 22 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు, వివరాలు ఇలా
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్(సీఎస్ఎల్) ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముంబయి ఎయిర్‌పోర్టులో 998 హ్యాండీమ్యాన్ & యుటిలిటీ ఏజెంట్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ముంబయిలోని  ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 998 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..