Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని వెల్లడించింది. అందులో వచ్చే సమాచారంపై క్లిక్ చేయొద్దని ప్రజలకు హెచ్చరించింది. హ్యాక్ అయినందున ఎక్స్‌లో పోస్టు చేసే లింక్స్ అసలు క్లిక్ చేయద్దని సూచించింది.
హ్యాక్ అయిన ఎక్స్‌ను రికవరీ చేసే పనిలో ఉన్నామని పేర్కొంది హైదరాబాద్ మెట్రో. అప్పటి వరకు దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది. దీనిపై తమ సిబ్బంది వర్క్ చేస్తున్నారని వివరించింది. పూర్తిగా సెట్ అయిన తర్వాత అందరికీ మరోసారి సమాచారం అందిస్తామని అంది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికులకు సూచించింది.
సోషల్ మీడియాలో హైదరాబాద్ మెట్రో చాలా చురుగ్గా ఉంటుంది. వచ్చిన ప్రతి సందర్భాన్ని వాడుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఆఫర్లు తెలియజేస్తుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో ఆలోచించే పోస్టుుల పెడుతూ ఉంటుంది. అలాంటి ఎక్స్ అకౌంట్ హ్యాక్ అవ్వడంతో షాక్ అయింది. అయితే అందులో వచ్చిన సమాచారాన్ని నిజమని నమ్మి ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని గ్రహించి ఈ అలర్ట్ మెసేజ్ పెంపించింది.
దీంతో ప్రజలు అలర్ట్ అవుతారని అందులో వచ్చే స్పామ్ లింక్స్ క్లిక్ చేయకుండా ఉంటారని భావించి ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు కూడా వైరల్ అవుతోంది. తరచూ మెట్రో ఎక్కే వాళ్లంతా తమ సోషల్ అకౌంట్స్‌లో షేర్ చేస్తున్నారు.