IAS Transfer In Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్న భారతి హోళికేరిని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా నియమిస్తూ బదిలీ చేశారు. నిజామాబాద్‌ కలెక్టర్‌గా రాజీవ్‌ గాంధీ హనుమంతు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌ ను నియమించారు. అయితే హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 


ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా యాస్మిన్‌ బాషా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.హరీశ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకటరావు, వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్, నిర్మల్ కలెక్టర్ గా కామాటి వరుణ్ రెడ్డి, జగిత్యాల కలెక్టర్ గా కర్నాన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ - భారతి హోళికేరి
- నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ - రాజీవ్‌ గాంధీ హనుమంతు
- మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ -  అమోయ్‌ కుమార్‌
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు
- హనుమకొండ జిల్లా కలెక్టర్‌  -  సిక్తా పట్నాయక్‌ 
- ఆదిలాబాద్ కలెక్టర్  -  రాహుల్ రాజ్
- వికారాబాద్ కలెక్టర్  -  నారాయణ రెడ్డి
- కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ - షేక్ యస్మిన్ బాషా
- మహబూబ్ నగర్ కలెక్టర్  -  రవి
- సూర్యాపేట్ కలెక్టర్ గా  -  వెంకట్ రావు
-  రంగారెడ్డి కలెక్టర్  -   హరీష్
- మంచిర్యాల కలెక్టర్   -  బడవత్ సంతోష్ 
- మెదక్ కలెక్టర్   -  రాజశ్రీషా పవర్ 
- వనపర్తి కలెక్టర్  -  తేజస్ నందలాల్
- నిర్మల్ కలెక్టర్   -   కామాటి వరుణ్ రెడ్డి
- జగిత్యాల కలెక్టర్  -  కర్నాన్


జనవరి తొలి వారంలో ఐపీఎస్‌ల బదిలీ 
తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వెయిటింగ్ లో ఉన్న కొందరికి పోస్టింగ్ ఇచ్చింది. 29 మంది అధికారులను బదిలీ చేసింది. కొంత మందికి బదిలీలతోపాటు అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. అయితే నల్గొండకు ఎస్పీని నియమించే వరకూ ఆమే కొనసాగనున్నారు.  


టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా స్వాతి లక్రా..


డీజీపీ కార్యాలయంలో వ్యవహారాల ఏడీజీ రాజీవ్ రతన్ ను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ స్థానంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఏడీజీ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించారు. రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా ఉన్న సందీప్ శాండిల్యను పోలీసు అకాడమీ డైరెక్టరుగా నియమించారు. డీజీపీయంలో ఏడీజీ (పర్సనల్) గా ఉన్న బి.శి వధర్ రెడ్డిని రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీ అభిలాష బిస్త్ ను డీజీపీ కార్యాలయంలో సంక్షేమం, స్పోర్ట్స్ ఏడీజీగా బదలాయించారు. ఆమెకే హోం గార్డ్ ఏడీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టరుగా ఉన్న శిఖా గోయల్ ను షీ టీములు, భరోసా, మహిళా భద్రత విభాగాలకు ఏడీజీగా బదిలీ చేశారు. స్వాతి లక్రాను టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా బదిలాయించారు.